అదేమాట ఆళ్లకు చెప్పండి సాయిరెడ్డి గారు

February 21, 2020

తమ తప్పులను కన్వీనియెంట్ గా మరిచిపోయి... ఇతరులపై నిందలు వేసి నిరూపించుకోమనే కొత్త రాజకీయాన్ని కనుగొన్న వ్యక్తి సాయిరెడ్డి. వైసీపీలోనే కాదు, దేశంలోనే అత్యధిక పదవులు అనుభవిస్తున్న సాయిరెడ్డి గారు, పదికి పైగా కేసుల్లో ఉండి... ఇతరులను ఉత్తములు అని నిరూపించుకోమంటున్నారు. కొద్ది రోజులుగా వైకాపా నాయకులు తెలుగుదేశం వాళ్లపై ఇన్ సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు చేశారు. ఆరోపణలు ఎవరిపైన చేశారో వాళ్లు బయటకు వచ్చి... మీకు దమ్ముంటే నిరూపించండి. నిరూపిస్తే ఆ భూములు మీకే ఇస్తాం, శిక్షకు కూడా రెడీ అంటున్నారు. ప్రభుత్వంలో మీరున్నారు. అధికారం మీ చేతిలో ఉంది. మరి మాపై కేసులు పెట్టి విచారణ చేయకుండా ఎందుకు ఊరికే ఉన్నారు అంటూ వాళ్లు ప్రశ్నిస్తుంటే.. విజయసాయిరెడ్డి మాత్రం కామెడీ సృష్టిస్తున్నారు. 

కొన్నేళ్ల క్రితం అల్లరినరేష్ సినిమా వచ్చింది... అందులో బ్రహ్మానందం భూమిని ఎవడో కబ్జా చేస్తే బ్రహ్మానందం వాడితో ఇలా  అంటాడు ’’ఏయ్ నా భూమిని కబ్జా చేశావా, నేను బిజీగా ఉన్నాను. అలాగే పోలీస్ స్టేషనుకు వెళ్లి నా స్థలం కబ్జా చేశానని నీ మీద నువ్వే కేసుపెట్టుకో’’ అంటాడు. సేమ్ డైలాగ్ ఇపుడు సాయిరెడ్డి టీడీపీ లీడర్లకు చెబుతున్నారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగి ఉంటే తమపై విచారణ చేయమని సీబీఐ ఎవరికి వారే కోరాలట. ఆరోపణలు చేసింది వైసీపీ. నిరూపించమని ఛాలెంజ్ విసిరింది టీడీపీ. మరి అధికారం చేతిలో పెట్టుకుని నిరూపించడానికి ఏమైంది?  అంటే ఆరోపణలు నిజం కాదు, కేవలం నిందలే అనే కదా అర్థం.

టీడీపీ నేతలు కూడా పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కడ ఎపుడు ఎలా భూములు కొన్నారో చెప్పారు. అలాంటి వారిలో ఆళ్ల కూడా ఒకరు. ఆళ్ల కూడా టీడీపీ వాళ్లలాగే బయటకు వచ్చి నా మీద ఆరోఫణలు అబద్ధం. నిరూపించండి అంటాడు. ఇదేం కామెడీనో అర్థం కాదు. అధికారం వాళ్ల చేతిలో పెట్టుకుని ప్రైవేటు వ్యక్తులను, ప్రతిపక్షాలను నిరూపించమని అడగడం ఏంటి.... చేతిలో రెవెన్యూ డిపార్టుమెంట్ ఉంది తేల్చి పడేయొచ్చు. మరి టీడీపీ వాళ్లకేమో సాయిరెడ్డి మీ మీద మీరే సీబీఐ విచారణకు లేఖ రాసుకోండి అంటాడు. ఆ మాట అమరావతిలో భూములు కొన్న వైసీపీ నేతలకు ముందు చెప్పి పాతివ్రత్యం నిరూపించుకోవచ్చు కదా. రాజకీయాల్లో సాయిరెడ్డి గురించి తెలుసుకోవాలంటే ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. ఆయన ట్వీట్లకు కింద జనాలు ఇచ్చే రిప్లయిలలోనే అనేక ఆధారాలున్నాయి. ఈ మధ్య జనం జోకులు చదివే బదులు సాయిరెడ్డి ట్వీట్లు చదువుతున్నారు.