సిగ్గు వదిలేసిన సాక్షి !

October 18, 2019

ఏంటి ఇంతమాట అనేశారు అనుకునేరు. ఇది మా మాట కాదు. లోకేష్ మాట. ప్రతిపక్షాన్ని పిచ్చపిచ్చగా ఎంజాయ్ చేస్తున్న లోకేష్ జగన్ పై, సాయిరెడ్డిపై, వైసీపీ పార్టీ నేతలపై బుల్డోజర్ తో దాడిచేస్తున్నాడు. సూటిగా, వాడిగా లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలకు వైసీపీ సమాధానం కూడా చెప్పలేకపోతుంది. సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్నవారికి ఈ వెసులు బాటు ఉంటుంది. అయితే, అందరూ ఊహించిన దానికంటే ఎక్కువగా లోకేష్ అధికార పక్షాన్ని ఆడుకుంటున్నారు.
ఈరోజు బడ్జెట్ పంపకాలపై అన్ని పత్రికలు మోడీని దుమ్మెత్తి పోశాయి. చివరకు జగన్ మిత్రుడు కేసీఆర్ పత్రిక నమస్తే తెలంగాణ కూడా మోడీని ఏకిపారేసింది. పాపం జగన్ మాత్రం... ఈ దేశాన్ని మోడీ, నిర్మల తన భుజస్కందాలపై మోస్తున్నట్లు కీర్తిస్తూ సాక్షిలో బ్యానర్ పరిచారు. దీనిపై చెలరేగి పోయిన లోకేష్... అనగనగా జగన్ ఆయన విశ్వసనీయ విలువలు అంటూ సాక్షి పత్రికను దుమ్మెత్తిపోశారు.

లోకేష్ ఏమన్నారంటే
‘‘జగన్ గారూ! ఇన్నాళ్ళూ విశ్వనీయత అని మీరు అంటుంటే ప్రజల గురించి అనుకున్నాం. కానీ ఈ రోజు మీ విశ్వసనీయత మోడీ గురించి అని తెలిసింది. కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగితే, మీ అక్రమ పత్రిక సాక్షిలో కేంద్రానికి భజన చేస్తూ ఇలాంటి రాతలు రాసుకున్న మీ గులాంగిరికి సలాం. గతంలో కేంద్రం ఇలాగే ఏపీకి మొండిచెయ్యి చూపిస్తే, నైతిక బాధ్యత వహిస్తూ చంద్రబాబుగారు రాజీనామా చేయాలని మీరు డిమాండ్ చేశారు. ఇప్పుడు మీరు ఇంకా ఎందుకు రాజీనామా చేయలేదు? కేసుల భయంతో మీరు కేంద్రానికి దాసోహం అనొచ్చు. కానీ అందుకోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టే హక్కు మీకెక్కడిది? మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామన్నారు. ఈరోజు ప్రత్యేక హోదా ఊసే లేదు. ఏది మీ పోరాటం? ఏది మీ మడమ తిప్పని నైజం? కాళ్ళకు సాష్టాంగ పడటం, భజన చేయడమే పోరాటం అనుకుంటున్నారా? ఏపీ ప్రయోజనాలను సాధించడానికి మీరేం చేయదలచుకున్నారో చెప్పండి. ఇది ప్రజల తరపున మా డిమాండ్.‘‘
అంటూ లోకేష్ ట్విట్టరులో వ్యాఖ్యానించారు. సాధారణంగా 6 నెలల పాటు ప్రభుత్వానికి అవకాశం ఇద్దామని తెలుగుదేశం పార్టీ ముందుగా నిర్ణయించింది. కానీ జగన్ మొదటి రోజు నుంచే కక్ష సాధింపు చర్యలు చేపట్టడంతో తెలుగుదేశం పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకుంది. దీంతో మాటిమాటికీ ప్రతి రోజు జగన్ ను అడ్డంగా బుక్ చేస్తున్నారు లోకేష్.