వగలమారి సాక్షి జర్నలిజం పాఠాలు

July 09, 2020

సాక్షి టీవీలో వైఎస్ ఫొటో
సాక్షి పత్రికలో వైఎస్ ఫొటో
వైెఎస్ ఎవరు... ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి
ఫక్తు రాజకీయ నాయకుడి ఫొటో పేరు పక్కనే వేసుకుని ప్రపంచపు జర్నలిజం విలువల గురించి సాక్షి మాట్లాడటం ఎంత విడ్డూరమో కదా. అయినా ఆ టీవీకి రేటింగ్ ఉంది. ఎందుకు ఉందో తెలుసా... వార్తలు బోర్ కొట్టినపుడు ఆ ఛానెల్ పెడితే కావల్సినన్ని ముద్దు సీన్లు, కామెడీ ప్రవచనాలు మనకు దండిగా దొరుకుతాయి. ఈరోజు టీవీ9 ఛానెల్ పతివ్రత అయపోయింది, దానిని నడిపిన రవి ప్రకాష్ పతిత అయ్యాడు వాళ్లకు. జనాల్ని రకరకాలుగా టార్చర్ చేసిన ఆ ఛానెల్ లో రవి ప్రకాష్ నుంచి కింది స్థాయి ఉద్యోగి వరకు టీవీ 9 పాపాల్లో ప్రతి ఒక్కరి పాత్ర ఉంటుంది. పాపం అలాంటి టీవీ9 సామ్రాజ్యం నిర్మించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారు ఆ ఘనత సాధించి జనాల్ని వేధించిన ఆ ఛానెల్ పెద్దకు భారీ మేలే చేశారు. అది మరిచిపోయి ఈరోజు కేవలం రవి ప్రకాష్ మైకు పట్టుకుని రాష్ట్రమంతా తిరిగి చెప్పాడు. టీవీ9 నిది తప్పేలేదన్నట్లు గంటలు గంటలు రవిప్రకాష్ ను ఏకుతూ సాగింది సాక్షి ప్రసారాలు.
చరిత్రలో ఏ నాడూ పాత్రికేయ విలువలే కాదు, వ్యాపార విలువలు కూడా పాటించని పత్రిక సాక్షి. ఇతర పత్రికలు పేపరు ఎంతకు అమ్మాలో చెబుతూ విచిత్రమైన ఉద్యమం చేసిన సాక్షి అన్నీ మూసుకుని మళ్లీ ధర పెంచి అన్ని పత్రికల ధరకే అమ్ముతోంది. మరి చరిత్ర మరిచిపోతే ఎలా? ఇప్పటికీ 2 రూపాయలకు ఎందుకు అమ్మడం లేదు? అయినా జనాలు దానిని క్షమించడానికి ఒక కారణం ఉంది. అసలు దానిని ఒక మీడియా హౌస్ గా జనం గుర్తించడమే మానేశారు. చివరకు ఆ పత్రికను ప్రేమతో కొంటున్న చందాదారులు కూడా. కేవలం ప్రేమతో కొంటున్నారట. సామాజిక వర్గపు ప్రభావం.