ఇప్పుడే ఇలా అయితే ఎలా జ‌గ‌న్‌ ...?

June 01, 2020

కంటి ముందు క‌నిపించే నిజాన్ని కూడా అబ‌ద్ధంలా అందంగా రాయించే స‌త్తా జ‌గ‌న్ ప‌రివారానికి మాత్ర‌మే ఉంద‌ని చెప్పాలి. నిద్ర లేచింది మొద‌లు ప‌చ్చ మీడియా అంటూ విరుచుకుప‌డే జ‌గ‌న్ ప‌రివారం.. త‌మ సొంత మీడియాలో నిజాలు త‌ప్పించి ఇంకేమైనా రాస్తారా? అన్న సందేహం క‌లిగించేలా ఉన్నాయ‌ని చెప్పాలి. అధికారిక షెడ్యూల్ ఒక‌టి ఉంటుంద‌న్న విష‌యాన్ని వ‌దిలేసి మ‌రీ.. ఇష్టారాజ్యంగా రాయ‌టం వారికి మాత్ర‌మే చెల్లు.
ఎక్క‌డి విష‌యాలో ఎందుకు? తాజాగా రామోజీ ఫిలింసిటీలో మీడియా మొఘ‌ల్ రామోజీ రావుతో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు భేటీ అయిన ఉదంత‌మే దీనికి నిద‌ర్శ‌నంగా చెప్పాలి. పచ్చ కామెర్ల వాడికి లోక‌మంతా ప‌చ్చ‌గా క‌నిపించే చందంగా తాను అనుకున్న లైన్ లో వండి వార్చే ఉద్యోగుల్ని పెట్టేసుకున్న జ‌గ‌న్ మీడియా.. రాసే రాత‌లు చూస్తే.. రానున్న రోజుల్లో ఇలాంటివెన్నో చూడాల్సి ఉంటుంద‌న్న అభిప్రాయం క‌లుగ‌క మాన‌దు.
ఏపీలో అధికారం వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయం బ‌లంగా వినిపిస్తున్న వేళ‌.. బాబును డ్యామేజ్ చేసే ఏ చిన్న అవ‌కాశాన్ని వ‌ద‌ల‌కుండా విరుచుకుప‌డుతోంది జ‌గ‌న్. నిత్యం నీతులు చెప్పే ఆయ‌న ప‌రివారం.. అబ‌ద్ధాల్ని నిజాలుగా రాసేస్తున్న వైనంపై విస్మ‌యం వ్య‌క్త‌మ‌వుతోంది.
తాజాగా రామోజీ ఫిలింసిటీలో బాబు.. రామోజీల భేటీ కేవ‌లం గంట మాత్ర‌మే జ‌రిగింది. ఆ మాట‌కు వ‌స్తే.. బాబు ప్ర‌యాణానికి సంబంధించిన అధికారిక షెడ్యూల్ చూస్తే.. రామోజీ ఫిలిం సిటీలో బాబు ఉన్న‌ది 1.45 గంట‌లు మాత్ర‌మే. అది కూడా హెలిప్యాడ్ కు చేరుకోవ‌టం మొద‌లు మ‌ళ్లీ హెలిప్యాడ్ కు వెళ్లే వ‌ర‌కూ కేటాయించిన స‌మ‌యం 105 నిమిషాలు మాత్ర‌మే. ఇందులో హెలిప్యాడ్ నుంచి రామోజీ సెక్ర‌టేరియ‌ట్ (రామోజీ ఫిలింసిటీలో రామోజీరావుగారి అధికారిక కార్యాల‌యాన్ని ఇలా పిలుస్తార‌ని చెబుతారు)కు వెళ్ల‌టానికి త‌క్కువ‌లో త‌క్కువ 15 నిమిషాల స‌మ‌యం ప‌డుతుంది. అదే రీతిలో రిట‌ర్న్ కూడా మ‌రో 15 నిమిషాలు. అంటే.. హెలిప్యాడ్ నుంచి రామోజీని క‌లిసి.. మ‌ళ్లీ తిరిగి రావ‌టానికి 30 నిమిషాలు ప‌డుతుంద‌న్న మాట‌.
105 నిమిషాల్లో 30 నిమిషాలు దీనికే పోతే.. మిగిలేది 70 నిమిషాలు. ఇదంతా ఎందుకంటే.. సాక్షి లెక్క ప్ర‌కారం రామోజీ ఫిలింసిటీలో రామోజీరావుతో చంద్ర‌బాబు మూడుగంట‌ల పాటు గ‌డిపార‌ని.. వివిధ అంశాల‌పై మాట్లాడిన‌ట్లుగా అచ్చేశారు. నిత్యం ఎదుటివారి త‌ప్పుల్ని ఎత్తిచూపే ఒక మీడియా సంస్థ‌.. త‌న‌కు తానుగా బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంది. ఆ విష‌యాన్ని వ‌దిలేసి.. ఏదో జ‌రిగిపోయిన‌ట్లుగా రాసే రాత‌ల్లో వాస్త‌వం ఎంత‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌.
చంద్ర‌బాబు.. రామోజీలు ఇద్ద‌రూ ఏకాంతంగా కూర్చొని మాట్లాడుకున్న మాట‌ల్ని అందంగా రాసేసిన జ‌గ‌న్ ప‌రివారానికి.. ఇద్ద‌రిలో సాక్షికి స‌మాచారం ఇచ్చే అవ‌కాశం ఉందా? అన్న‌ది మ‌రో ప్ర‌శ్న‌. అధికారిక షెడ్యూల్ విష‌యంలోనే.. త‌ప్పుదారి ప‌ట్టించేలా ఉన్న రాత‌ల రోత‌ను చూస్తే.. ఇంక విష‌యంలో పేర్కొన్న అంశాల్లో వాస్త‌వం పాళ్లు ఎంత‌న్న‌ది ఎవ‌రి అంచ‌నాకు వారిని వ‌దిలేయొచ్చు. 

note: official not attached: see below picture.