సాక్షిలో తప్పు రాశారు.. ఈనాడు చూడండని చెప్పిన జగన్

February 24, 2020

తనను తాను కాపాడుకోవడానికి జగన్ ఈరోజు తన సొంత పేపరును తప్పు పట్టాల్సి వచ్చింది. సన్నబియ్యంపై ప్రతిపక్షాలు నిలదీసిన సందర్భంగా ఈ దృశ్యం చోటుచేసుకుంది. మేము మా మేనిఫెస్టోలో నాణ్యమైన బియ్యం ఇస్తామని మాత్రమే ప్రకటించామని జగన్ చెప్పారు. అయితే, సాక్షి పేపరులో తప్పు రాశారు అని.. ప్రతిపక్షాల లాగే సాక్షి కూడా కన్ఫ్యూజ్ అయ్యిందని జగన్ అన్నారు. కావాలాంటే.. ఆరోజు ఈనాడు తదితర పేపర్లు చూసుకోండని, కరెక్టుగా రాశారని జగన్ చెప్పారు. 

ఇదంతా బాగానే ఉంది గాని... ఇందులో ఉద్దేశపూర్వక కుట్ర ఉందని జగన్ మాటలను బట్టి అర్థమవుతుంది. దీనిపై కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి. వాస్తవానికి జగన్ కి నష్టం జరిగే పని సాక్షి పత్రిక చేయదు. సహజంగానే ఏ విషయాన్ని అయినా తమ అధినేతకు మేలు చేకూరేలా రాయడం సాక్షికి అలవాటు. ఆరోజు జగన్ విడుదల చేసిన మేనిఫెస్టో జనాలకు చేరేంది మీడియా ద్వారానే. మరి మీడియా ద్వారా చేరినపుడు జగన్ పథకాలు ఎలా ఉన్నాయో... జనం సాక్షిలో తెలుసుకోవాలనుకుంటారు. ఎందుకంటే మిగతా వాళ్లు పొరపాటున ఏమైనా తేడాగా రాస్తారేమో అని... సాక్షి ద్వారా తెలుసుకుందాం అనుకుంటారు. ఇది సాక్షి యాజమాన్యం అర్థం చేసుకుంది. అందుకనే సన్నబియ్యం అని మేనిఫెస్టోలో చెప్పకపోయినా అదే పనిగా సన్నబియ్యం అని పేపర్లో రాసింది. భవిష్యత్తులో జగన్ తప్పును సాక్షి మీద నెట్టడానికి ఉపయోగపడుతుంది అని ఓ వ్యూహం ప్రకారం సాక్షిలో తప్పు రాశారు. అనుకున్నట్లుగానే సాక్షి తప్పును అడ్డంపెట్టుకుని తప్పించుకున్నారు. జనాన్ని తమ ఇవ్వని హామీ గురించి సాక్షి ద్వారా నమ్మించిన మాట అయితే నిజం.

సరే... సాక్షిని పక్కనపెడితే... స్వయంగా జగన్... వేర్వేరు సందర్భాల్లో ఇంటర్వ్యూల్లో స్వయంగా మాట్లాడుతూ సన్నబియ్యం గురించి మాట్లాడారు. సన్న బియ్యం ఇస్తానని చెప్పారు. అంటే జగన్ ఎందుకు తప్పుగా చెప్పారు. ఆధారాల్లో మాత్రం సన్నబియ్యం అని ముద్రించకుండా నోటితో చెబితే... అది జనాల్లోకి వెళ్లి పోతుందని, అందరూ నమ్మేస్తారని.. ఆ తర్వాత ఫ్లేటు ఫిరాయించవచ్చని జగన్ భరోసానా? సాక్షి సంగతి తర్వాత.. జగన్ ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యారు.

ఈ వ్యవహారంలో స్పష్టంగా అర్థమవుతున్నది ఏంటంటే.. ఎన్నికలకు ఏడాది ముందు నుంచి జనాలకు అలవికాని హామీలు ఇచ్చి ... సరిగ్గా ఓటింగ్ కు వారం పది రోజుల ముందు నుంచి వాటన్నటిని కాకుండా హామీలన్నీ మార్చి ముద్రిస్తే... అప్పటికపుడు జనానికి ఎలా తెలుస్తుంది. అంటే ఇదంతా అదే పనిగా కావాలనే జనాన్ని నమ్మించడానికి వైసీపీ పన్నిన వ్యూహంలా కనిపిస్తోంది.