​పరువు పోగొట్టుకున్న సాక్షి ..!!

September 17, 2019

​సాక్షి దినపత్రిక... జగన్ సొంతం. ఈ పత్రిక నుంచి వైసీపీపై పొగడ్తలు, ఇతర పార్టీల అనుకూలురపై తిట్లు మినహా మరేమీ ఆశించరు. చివరకు వైసీపీ అభిమానులు కూడా వేసీపీయేతర వార్తల కోసం ఇతరుల మీద ఆధారపడక తప్పని పరిస్థితి. దీన్ని అందూ కరపత్రికలా భావిస్తారు. అంతేగాని ఎవరూ దినపత్రికలా భావించరు. అందులో వైసీపీ భజన, టీడీపీపై విమర్శలు ఆ రేంజిలో ఉంటాయి.
ఈ క్రమంలో విచక్షణ మరిచిన సాక్షి నిన్న వేసిన ట్వీటుకు విపరీతంగా ట్రోల్ అయ్యింది. దేశంలో ’’టుడేస్ చాణక్య‘‘ మోస్ట్ క్రెడిబుల్ సర్వే సంస్థ. ఇది భారతదేశంతో పాటు యూరప్, అమెరికాల్లోనూ వివిధ దేశాల్లోనూ కచ్చితమైన సమాచారంతో కూడిన సర్వేలు ఇస్తుంది.
2009 నుంచి దాదాపు అన్ని ఎన్నికల్లో టుడేస్ చాణక్య చెప్పిన ఫలితాలు వంద శాతం నిజం అయ్యాయి. 2014లో బీజేపీకి సొంతంగా మెజారిటీ వస్తుందని చెప్పిన ఏకైక సంస్థ కూడా ఇదే. ఈ సారి టుడేస్ చాణక్య... దేశంలో బీజేపీ మళ్లీ అధికారం చేపడుతుందని, ఏపీలో చంద్రబాబు అత్యధిక మెజారిటీతో గెలుస్తారని చెప్పింది.
అయితే, కొంతకాలం క్రితం ఆంధ్రజ్యోతి పత్రిక కార్పొరేట్ చాణక్య పేరుతో టీడీపీ గెలుస్తుందని ఓ సర్వే ప్రచురించింది. మిషన్ చాణక్య అనే సంస్థ తెలంగాణ ఎన్నికల్లో కేసీఆర్ గెలుస్తాడని చెప్పింది. ఏపీ ఎన్నికల్లో జగన్ గెలుస్తాడని చెప్పింది.
ఏది ఒరిజినలో తెలియని సాక్షి పత్రిక ఇష్టాను సారం ట్వీట్ వేసి పరువు పోగొట్టుకుంది.

ఇది సాక్షి ట్వీట్ :
మిషన్ చాణక్య సంస్థ వైసీపీ గెలుస్తుందని చెప్పగా, టుడేస్ చాణక్య పేరుతో టీడీపీకి అనుకూలంగా మరో సర్వేను బయటపెట్టారు. ఎగ్జిట్ పోల్స్ తమకు వ్యతిరేకంగా వస్తున్నాయని తెలిసి చంద్రబాబు కొన్ని బోగస్ సంస్థలతో తాము గెలుస్తున్నట్లు సర్వేలు విడుదల చేయించుకోవడం చర్చనీయాశంగా మారింది.

వాస్తవానికి టుడేస్ చాణక్య ఒరిజినల్... కానీ అదేదో చంద్రబాబు కోసం ఈఏడాది పుట్టిన సంస్థ అనుకుని కనీస పరిజ్ఝానం లేకుండా ఈ ట్వీట్ వేయడంతో జనం సాక్షిని ఏకిపడేసారు. చివరికి జనం తిట్లు తట్టుకోలేక ఆ ట్వీట్ డిలీట్ చేయక తప్పలేదు సాక్షికి. మరీ ఏది అనామక సంస్థో, ఏది ఒరిజినలో గుర్తుపట్టకపోతే ఎలా?