అభిమానికి షాకిచ్చిన బాలీవుడ్ హీరో

May 24, 2020

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు కోపం వచ్చింది. స్మార్ట్ ఫోన్లు చేతికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి దగ్గర పెద్ద కెమేరా ఉన్న పరిస్థితి. ఆసక్తికరమైన ప్రతి విషయాన్ని కెమేరాలో బంధించాలన్న తాపత్రయం అంతకంతకూ పెరుగుతోంది. దీనికి తోడు సోషల్ మీడియా పుణ్యమా అని.. ఆసక్తికరమైన అంశాల్ని షేర్ చేయటం ఎక్కువ అవుతోంది. ఇది పలువురు ప్రముఖులకు.. సెలబ్రిటీలకు తలనొప్పిగా మారుతోంది.
తాజాగా అలాంటి పరిస్థితే ఎదురైన సల్మాన్ ఖాన్ కోపంతో ఊగిపోయారు. పనాజీ ఎయిర్ పోర్టులో ఒకరు సల్మాన్ ఖాన్ తో ఫోటోలు దిగే ప్రయత్నం చేశారు. దీంతో.. కోపానికి గురైన సల్మాన్.. ఆ వ్యక్తి చేతిలోని ఫోన్ ను లాక్కున్నాడు. దీంతో.. షాక్ కు గురయ్యాడా యువకుడు.
 పనాజీ ఎయిర్ పోర్టులో చోటు చేసుకున్న ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సల్లూ భాయ్ కు అంతలా ఇరిటేట్ అయ్యేలా చేసిన వ్యక్తి పనాజీ ఎయిర్ పోర్టులో పని చేసే ఉద్యోగిగా గుర్తించారు. అభిమాని అన్న తర్వాత ఆత్రం మామూలే. ఆ మాత్రం దానికే అంతలా ఇరిటేట్ అయిపోయి.. ఫోన్ లాగేసుకుంటే ఎలా భాయ్?