సల్మాన్ లైఫ్ లో గర్ల్ ఫ్రెండ్స్ ఎంత మంది ఉన్నారంటే...

August 08, 2020

హిందీ బిగ్ బాస్ సీజన్ 13 ఇప్పుడు నడుస్తోంది. సల్మాన్ ప్రయోక్తగా నటిస్తున్న ఈ షోకు ఉన్న ప్రేక్షక ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ షోకు తాజాగా బాలీవుడ్ ప్రముఖ నటుడు అజయ్ దేవగణ్.. ఆయన సతీమణి ప్రముఖ నటి కాజోల్ వచ్చారు. ఈ సందర్భంగా వారి మధ్య సాగిన సంభాషణ ఆసక్తికరంగానే కాదు.. వార్తగా మారింది.
షోలో భాగంగా వారి మధ్య సాగిన సంభాషణలో నీకు ఐదుగురు కంటే తక్కువ మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? అని సల్మాన్ ను కాజోల్ అడగ్గా.. అందుకు అజయ్ దేవగణ్ కల్పించుకుంటే.. ఒకేసారా? జీవితం మొత్తంలోనా? అని జోక్ చేయటంతో ఆమె పడి పడి నవ్వారు.సల్మాన్ సైతం నవ్వేశారు.
తర్వాత సీరియస్ గా సమాధానం చెబుతున్నట్లుగా సల్మాన్ మాట్లాడుతూ.. తనకు కేవలం ఐదుగురు గర్ల్ ఫ్రెండ్స్ మాత్రమే ఉన్నారని.. తనకింకా పెళ్లి కాలేదన్నారు. ఈ సందర్భంగా అజయ్ మాట్లాడుతూ.. వర్జిన్ అని గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తే..కాజోల్ అందుకు  పెద్దగా నవ్వేశారు.  
సల్మాన్ మాత్రం తాను ఏ మహిళతోనూ సన్నిహితంగా లేనని చెప్పారు. అందుకు స్పందించిన కాజోల్.. అది పెద్ద అబద్ధమని.. తాను దాన్ని నమ్మనని.. తానే కాదు ఎవరూ నమ్మరన్నారు. ఇలా సరదా సరదాగా సాగిన షోలో సల్మాన్ భాయ్ సగం నిజం మాత్రమే చెప్పారని.. మిగిలిన సగం చెప్పేస్తే బాగుండేది కదా? అని వ్యాఖ్యానిస్తున్నారు.