కరోనా వేళ.. ప్రియురాలితో ఫాం హౌస్ లో స్టార్ హీరో

August 07, 2020

తరచూ వార్తల్లోకి వస్తుంటారు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. ఏదో ఒక వివాదంలో ఆయన పేరు వినిపిస్తుంటుంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావేళ.. సల్మాన్ ఎక్కడ ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? అన్న ప్రశ్నలకు సమాధానం ఇచ్చేలా పలు ఫోటోల్ని పోస్టు చేస్తున్నారు. వాటి ప్రకారం తన ఫామ్ హౌస్ లో ఉన్నట్లుగా అర్థమవుతుంది. కండల వీరుడితో పాటు అతడి ప్రియురాలు లులియా వంతూర్ కూడా ఉన్నారా? అన్న సందేహానికి అవునన్న సమాధానం లభిస్తుంది.
తాజాగా ఒక వీడియో బయటకు వచ్చి వైరల్ గా మారింది. సల్మాన్.. లులియా ఇద్దరూ ఒకేచోట ఉన్నట్లుగా చెప్పే వీడియో బయటకు వచ్చింది. దీంతో వీరిద్దరూ ఫామ్ హౌస్ లో ఉన్నారన్న వాదనకు బలం చేకూరేలా మారింది. ఇందులో లులియా వేరెవరితోనో వీడియో చాట్ చేస్తున్నప్పుడు.. వెనుక నుంచి సల్మాన్ వస్తారు.
దీంతో ఇబ్బందికి గురి అవుతుంది లులియా. వెంటనే.. అతడ్ని పక్కకు వెళ్లమని సైగ చేస్తుంది. అతడు పక్కకు వెళ్లిన తర్వాత.. తల మీద చేతిని పెట్టుకొని.. భలే పని చేశావుగా అన్నట్లు ఎక్స్ ప్రెషన్ ఇవ్వటం కనిపిస్తుంది. సల్మాన్ వెనకు నుంచి రావటం లులియాకు ఎందుకు ఇబ్బందిగా మారింది? అన్నది ఒక క్వశ్చన్.
అంత పెద్ద సూపర్ స్టార్ నిజజీవితంలో ఎలా ఉంటాడన్న విషయం తాజా వీడియోను చూసినప్పుడు ఇట్టే అర్థం కాక మానదు. మొత్తంగా సల్మాన్ తో పాటు అతగాడి గాళ్ ఫ్రెండ్ ఫామ్ హౌస్ లోనే ఉంటారన్న విషయంపై తాజా వీడియో ఫుల్ క్లారిటీ ఇచ్చేసిందని చెప్పాలి.