సల్మాన్ ఖాన్‌కీ తప్పని కరోనా ఎఫెక్ట్

August 07, 2020

కరోనా కారణంగా దేశమంతా లాక్ డౌన్ కావడంతో ఎక్కడివారక్కడ నిలిచిపోయారు. ఎంత పెద్ద సమస్య వచ్చిన ఒక చోటి నుంచి మరో చోటికి వెళ్లలేని పరిస్థితి. ముఖ్యంగా బంధువులు, కుటుంబీకులు మరణించినా కూడా చాలామంది వెళ్లలేకపోతున్నారు. తాజాగా బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ ఖాన్‌కూ ఇదే పరిస్థితి ఎదురైంది. మేనల్లుడి అంత్యక్రియలకు వెళ్లలేకపోయారు.
సల్మాన్ ఖాన్ మేనల్లుడు అబ్దుల్లా ఖాన్, సోమవారం నాడు అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. 38 ఏళ్ల అబ్దుల్లా ఖాన్, గుండెపోటు బారిన పడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. అయితే, మేనల్లుడి అంత్యక్రియలకు సల్మాన్ ఖాన్ హాజరు కాలేని పరిస్థితి నెలకొంది. అబ్దుల్లా ఖాన్ అంత్యక్రియలు ఇండోర్ లో జరిగాయి. కానీ, సల్మాన్ ఖాన్ దీనికి హాజరుకాలేకపోయారు.
సల్మాన్ ఖాన్ ముంబైలో ఉండిపోయాడు. కరోనా వ్యాప్తి నివారణకు లాక్ డౌన్ అమలవుతున్న కారణంగా, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే పరిస్థితి లేదు. దీంతో సల్మాన్ ఖాన్ ఈ అంత్యక్రియలకు హాజరు కావడం లేదు.
లాక్ డౌన్ అమలు చేసినప్పటి నుంచి దేశంలో ఎందరికో ఇలాంటి పరిస్థితే ఎదురైంది. కొందరు సొంత తల్లిదండ్రుల అంత్యక్రియలకు కూడా వెళ్లలేకపోయారు. పొరుగు రాష్ట్రాల్లో ఉండిపోవడం.. రైళ్లు, బస్సులు, కార్లు ఏవీ తిరక్కపోవడంతో ఇలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.