59 సెకన్ల వీడియో... దుమ్మురేపింది

May 26, 2020

సామజవరగమనా.. నిను చూసి ఆగగలనా? మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా? అంటూ మనసును ఊపేసిన పాటను ఇప్పటిదాకా వందలసార్లు విన్నోళ్లంతా.. దృశ్యరూపంలో ఎలా ఉంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. న్యూఇయర్ కానుకగా ఈ పాటకు సంబంధించిన 59 సెకన్ల నిడివి ఉన్న వీడియోను పోస్టు చేశారు.

ఇన్నాళ్లుగా విన్న పాటను చూస్తున్న వేళ.. పొందే అనుభూతి అంతా ఇంతా కాదు. ప్రతి ఫ్రేమ్ ను ఎంతో శ్రద్ధగా చెక్కినట్లుగా ఉండటమే కాదు.. త్రివిక్రమ్ పనితనం కనిపిస్తోంది. దీనికి తోడు పూజ హెగ్డే సొగసు.. దానికి బన్నీ ఎనర్జీ తోడు కావటం.. బ్యాక్ గ్రౌండ్ లో అందమైన లొకేషన్లతో.. క్యాస్టూమ్స్.. రిథమ్ కు తగ్గట్లుగా ఉన్న డ్యాన్స్ మూమెంట్స్ తో ఈ పాటను చూసేందుకైనా సినిమా చూడాలన్న భావన కలిగేలా ఉంది. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నవేళ.. ఈ వీడియో క్లిప్ తో అభిమానులకు పెద్ద గిఫ్ట్ ఇచ్చారని చెప్పక తప్పదు.

సాంగ్ ఆఫ్ ద ఇయర్ గా పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్నదానికి ఏ మాత్రం తీసుపోని రీతిలో ఉన్న పాటతో ‘అల వైకుంఠపురంలో..’ మీద మరింత అంచనాలు పెంచేలా ఉన్న ఈ పాట బన్నీ అభిమానుల్ని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి చేస్తుందని చెప్పక తప్పదు.