సమంత కీలక నిర్ణయం... !

July 08, 2020

సమంత ... తెలుగులో చిలిపి హీరోయిన్ మాత్రమే కాదు. ఒక మంచి అమ్మాయి కూడా. ఇప్పటికే తన ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా చాలా మందికి సహాయం చేసింది. తాజాగా ఆమె మరో మంచి పనికి శ్రీకారం చుట్టింది. అయితే, ఇది జగ్గీ వాసుదేవ్ ఇచ్చిన ర్యాలీ ఫర్ రివర్స్ పిలుపులో భాగంగా ఆమె ఈ పనిచేస్తోంది. కావేరీ నది పరిరక్షణ కోసం లక్ష మొక్కలు నాటే ఉద్యమం చేపట్టింది వాసుదేవ్ ఆధ్వర్యంలోని ఈషా ఫౌండేషన్. దీనికోసం సమంత విరాళాలు సేకరిస్తోంది.
కావేరీ కాలింగ్ పేరిట ఒక వెబ్ సైట్ లో ఇలా ప్రచారం చేసే ప్రతి ప్రముఖుడికి ఒక పేజీ కేటాయించారు. దానిని ఆయా ప్రముఖులు ప్రచారం చేసుకుంటారు. అలాగే సమంత samantha.cauverycalling.org ద్వారా విరాళాలు ఇవ్వమని కోరుతోంది. కావేరీ పిలుస్తోంది, లక్ష మొక్కలు నాటుదాం, రండి అంటూ అభిమానులకు పిలుపునిచ్చారు. కేవలం రూ.42 విరాళంగా అందిస్తే ఒక మొక్కను నాటినవారవుతారని సమంత వివరించారు. ఎన్ని 42 రూపాయలు ఇస్తే అన్ని మొక్కలు నాటినట్టు అని చెబుతోంది. గత 50 ఏళ్లలో కావేరి పరివాహకంలో 87 శాతం చెట్లు అంతరించడమో లేదా నాశనం చేయబడటమో జరిగింది. ఇపుడు ఆ చెట్ల పునరుద్ధరణకు ఈషా ఫౌండేషన్ శ్రీకారం చుట్టింది. కావేరీ బేసిన్ లో నానాటికీ భూగర్భ .జలాలు కూడా అంతరించి పోతున్నాయని, దీనికి కారణంగా 40 శాతం కావేరీ ప్రవాహం పడిపోవడమే అని సద్గురు చెబుతున్నారు. 242 కోట్ల చెట్లు కావేరీ బేసిన్ లో నాటడం ద్వారా మళ్లీ కావేరి నది పునరుజ్జీవంప జేయొచ్చని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో కావేరీ బేసిన్ లో ఆగ్రో ఫారెస్ట్రీతో పాటు, అటవీ ప్రాంతాల్లో చెట్లు నాటేలా రైతులను ప్రోత్సహించడానికి ఈ నిధులు సేకరిస్తున్నారు. దీనికోసం ఒక మొక్కను నాటి సంరక్షించడానికి 42 రూపాయలు ఖర్చవుతుంది. దానిని విరాళంగా ఇవ్వమని ఈషా ఫౌండేషన్ అడుగుతోంది. సమంత డొమైన్ ద్వారా విరాళం ఇవ్వొచ్చు లేదంటే.. https://www.ishaoutreach.org/en/cauvery-calling ద్వారా కూడా విరాళం ఇవ్వొచ్చు. ఈ మంచి పనికి శ్రీకారం చుట్టిన సద్గురు జగ్గీ వాసుదేవ్ కు, నటి సమంతకు మీ సహకారం అందించండి.