పూజా హెగ్దే, రష్మికను తొక్కేసిన సమంత

August 07, 2020

అక్కినేని వారి కోడలు సమంత గ్లామర్‌, పాపులారిటీ పెళ్లి తర్వాత పెరుగుతోందేగానీ తగ్గడంలేదు. నేను అలిగాను, బుంగమూతి పెట్టానంటూ శామ్‌ చెప్పిన డైలాగ్‌ ఆడియన్స్‌ గుండెల్లో సూటిగా గుచ్చుకుంది. పెళ్లి తర్వాత సమంత చేసిన మూవీలన్నీ హిట్లే. 'అ ఆ' నుంచి వరుసగా 'జనతా గ్యారేజ్',  ‘రంగస్థలం', ‘మహానటి', ‘యూటర్న్', ‘మజిలీ', ‘ఓ బేబీ', 'జాను' వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. కుర్ర హీరోయిన్ల పోటీ ఎంతున్నా తనరేంజేమిటో చూపించింది.
తెలుగు నేలను దున్నేస్తున్న అందాల బొమ్మలు పూజా హెగ్డే, రష్మిక మందన్నను కూడా తాజాగా శామ్‌ వెనక్కు నెట్టింది. హైదరాబాద్ టైమ్స్ చేపట్టిన `30 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2019` లిస్టులో ఫస్టు వచ్చింది. వివిధ రంగాల్లోని 40 ఏళ్ల లోపున్న విమెన్‌ సెలబ్రిటీలను లెక్కలోకి తీసుకుని ఈ సర్వే చేశారు. అందరికంటే సమంతకు ఎక్కువ ఓట్లు పడ్డాయి. అన్ని విభాగాల్లో టాప్‌ క్లాస్‌ చూపిన సమంత ఫస్ట్‌ ప్లేస్‌ చేజిక్కించుకుంది. గ్లామర్‌ డాల్స్ పూజా హెగ్డే ఐదో స్థానంలో ఉండగా, రష్మిక మందన్న 9వ స్థానంలో నిలిచింది. వీరికంటే బెటర్‌గా బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పీవీ సింధు మూడో ప్లేసులో సెటిలయ్యారు. గ్లామర్‌ డోస్‌ తగ్గి సిల్వర్‌ స్క్రీన్‌కు దూరమవుతున్న రకుల్‌, కాజల్ వరుసగా 7, 8 ప్లేసులు పంచుకున్నారు. ఈ 30 మందిలో యాంకర్‌ శ్రీముఖి కూడా ఉంది. ఆమె ఫెర్ఫార్మెన్సుకు 25వ స్థానం దక్కింది.