సమంత ఫ్యాన్స్ ఇలా చేశారేంటి !!

August 07, 2020

పూజా హెగ్డేకు సంబంధించి ఇప్పటిదాకా బాలీవుడ్లో కానీ.. టాలీవుడ్లో కానీ ఎలాంటి వివాదం లేదు. ఆమె పట్ల ఎవరిలో ఎలాంటి వ్యతిరేకత లేదు. ఐతే తొలిసారిగా ఆమె వివాదంలో చిక్కుకుంది. వ్యతిరేకత ఎదుర్కొంటోంది.

నిన్న అర్ధరాత్రి పూజ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి సమంత గురించి ఒక నెగెటివ్ కామెంట్ పెట్టిన పోస్ట్ కనిపించడం.. దాని మీద వివాదం చెలరేగడం తెలిసిందే. టీవీలో మజిలీ సినిమా చూస్తుండగా.. సమంతను ఉద్దేశించి ఆమె అంత అందంగా లేదన్న కామెంట్ ఉంది ఆ పోస్టులో.

తన ఇన్‌స్టా అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేశారని.. తన డిజిటల్ టీం కష్టపడి తన అకౌంటును పునరుద్ధరించిందని.. హ్యాక్ అయిన టైంలో పెట్టిన పోస్టుల్ని పట్టించుకోవద్దని పూజా ట్వీట్ చేసింది. ఐతే పూజ చెబుతున్న మాటల్ని సమంత ఫ్యాన్స్ నమ్మట్లేదు. సమంత గురించి కామెంట్ చేసిన పోస్టును స్క్రీన్ షాట్లు తీసి ఆమెపై యుద్ధం ప్రకటించారు.

సమంతకు పూజ క్షమాపణలు చెప్పాలంటూ ఆమె అభిమానులు డిమాండ్ చేస్తూ ఒక హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. మరోవైపు పూజా ఫ్యాన్స్ ఏమో ఇందులో ఆమె తప్పేముందంటూ ‘వుయ్ స్టాండ్ విత్ పూజా హెగ్డే’ అని హ్యాష్ ట్యాగ్‌ పెట్టి ట్వీట్లు వేస్తున్నారు. సమంత అభిమానులు మాత్రం ఈ వ్యవహారాన్ని అంత తేలిగ్గా వదిలేలా కనిపించడం లేదు.

పూజా గతంలో తన ఇంట్లో టీవీ ముందు నిలబడి పోజు ఇచ్చిన ఒక ఫోటోను పట్టుకొచ్చి.. ఇప్పుడు సమంత మీద పెట్టిన పోస్టులో కనిపిస్తున్న టీవీని చూపిస్తూ రెండూ ఒకటే అని వాదిస్తున్నారు. హ్యాకర్ ఎవరైనా సరే.. కామెంట్ పెడితే పెట్టొచ్చు కానీ.. మజిలీ సినిమా పెట్టుకుని చూస్తూ మరీ ఇలా కామెంట్ చేస్తాడా.. ఇది కచ్చితంగా పూజా పెట్టిన పోస్టే అని, విమర్శలు రావడంతో డెలీట్ చేసిందని.. సెలబ్రెటీలు ఇలాంటి వివాదాలు తలెత్తితే అకౌంట్ హ్యాక్ అయిందని డ్రామాలాడటం మామూలే అని అంటూ పూజ చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు.