సమంత షేర్ చేసిన ఆ ఫొటోకు అర్థమేంటి?

August 07, 2020

తాజాగా ట్విట్టరులో సమంత ఒక ఫొటో షేర్ చేసింది. విక్టరీ సింబల్ చూపిస్తూ హెమ్ లుక్ లో మేకప్ లేకుండా ఉన్న ఆ ఫొటోలో సమంత చాలా ఉత్సాహంగా నవ్వుతూ కనిపించింది. క్యూట్ గా ఉందిలే.. కానీ ఈ ఫోజు ఫొటో ఇపుడు ఎందుకు షేర్ చేసిందా అని అనుమానపడుతున్నారు.

ప్రస్తుతం టీడీపీ మహానాడు జరుగుతోంది. విక్టరీ సింబల్ టీడీపీ మార్క్ సింబల్ గా మారిపోయింది. దానికి మద్దతుగా సమంత ఇలా సంఘీభావం తెలిపిందా అన్న చిలిపి అనుమానాన్ని కొందరు వ్యక్తంచేశారు. 

సమంత గత ఎన్నికల్లో రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కు బహిరంగ మద్దతు పలికింది. ఆయన ఇపుడు తెలుగుదేశంలోనే ఉన్నారు. రెండ్రోజులుగా ఆయన పార్టీ మారుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఆయనను ఉద్దేశించి ఆమె ఈ విక్టరీ చూపించిందా ? అని కొందరు అనుమానిస్తున్నారు.

బహుశా ఇవన్నీ కాకుండా ఆమె సాధారణంగా కూడా ఆ ఫొటో షేర్ చేసి ఉండొచ్చు. అయినా రాగాలు తీసేవాళ్లు ఏమైనా తీస్తారు కదా.