సమంత సర్ ప్రైజ్ పిక్స్ : ఫ్యామిలీ మాన్ లో మెరుపు

February 25, 2020

తక్కువ సమయంలో టాలీవుడ్ లో భిన్నమైన పాత్రలు పోషించిన టాప్ హీరోయిన్ గా సమంతను చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదు. పెళ్లి అయినా కూడా కెరియర్ స్లో కాకుండా ఎపుడు ఎలా స్టెప్ తీసుకోవాలో ఆ స్టెప్ తీసుకుంటూ సమంత అందరికీ పిచ్చెక్కిస్తోంది. చిలిపితనం, గ్లామర్ ఈ రెండు తగ్గకుండా అదే సమయంలో తన కెరియర్ గ్రోత్ కు ఉపయోగపడే క్యారెక్టర్లు చేస్తోంది. ఇపుడు అనుకోకుండా డిజిటిల్ సినిమాలోకి ఎంటర్ అయ్యింది. ఇంటర్ నెట్ సీరియల్స్ అని చెప్పుకోదగ్గర వెబ్ సిరీస్ లో ఆమె అడుగు పెట్టింది.

మనోజ్ బాజ్ పాయ్, ప్రియమణి  నటిస్తున్న ది ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ తో ఆమె తన డిజిటల్ కెరియర్ ను స్టార్ట్ చేయబోతోందట. ఇటీవల అమెజాన్ లో సూపర్ హిట్ అయిన  ఈ సిరీస్ రెండో సీజన్ లో సమంత మెరవనుంది. తాజాగా రిలేటెడ్ సీక్రెట్ రివీల్ చేస్తూ సమంత దిగిన ఫొటోలే ఇవి.