వైసీపీ మంత్రికి కల్తీ ఇసుక పంపిన అధికారులు

August 08, 2020

ఏపీలో అరాచకాలకు పరకాష్ట ఇసుక. తెలుగుదేశం హయాంలో ఇసుక చాలా తక్కువ ధరలో సులువుగా లభ్యమయ్యేది. అయితే, ప్రభుత్వం దీనిని ఆదాయ మార్గంగా మలచుకోవడంతో తలనొప్పులు తప్పడం లేదు. ఇసుకలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయని ప్రజలతో పాటు పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ఆరోపణలు చేయడం చూశాం. 

తాజాగా గోదావరి జిల్లాకు చెందిన మంత్రి విశ్వరూప్ కూడా గవర్నమెంటు యంత్రాంగం మోసానికి గురయ్యారు. ఆయన అమలాపురం ప్రాంతంలో కట్టుకుంటున్న ఇంటికోసం 4 లారీల ఇసుక బుక్ చేస్తే 4 లారీల మట్టిని పంపించారు.

ఇక్కడ భారీ డ్రామా నడిచింది.

మంత్రి విశ్వరూప్ ఇసుక ఎక్కడ బుక్ చేశారు?

ఆన్ లైన్లో గవర్నమెంట్ వెబ్ సైట్ లో.

ఆ వెబ్ సైట్ లో బుకింగ్ లు ఎవరు పర్యవేక్షిస్తారు?

గవర్నమెంటు సిబ్బంది.

బుక్ చేసిన ఇసుకను ఎవరు సరఫరా చేస్తారు ?

గవర్నమెంటు సిబ్బంది చెబితే ర్యాంపులో ఉన్న సిబ్బంది ఇసుకను సరఫరా చేస్తారు.

అంటే మొత్తం వ్యవహారంలో ఇసుక అమ్మేది గవర్నమెంటే, దాని ఆదాయం పొందేది గవర్నమెంటే అని అర్థమైంది కదా. తమాషా ఏంటంటే... మంత్రి విశ్వరూప్ తనకు మట్టి పంపడంపై కలెక్టరు మీద కోప్పడ్డారు. కలెక్టరు ఆర్డీవో మీద కోప్పడ్డారు. ఆర్డీవో ఇసుకను పరిశీలించి ఏం చేయాలి... మంత్రికి కలెక్టరుకు సారీ చెప్పాలి.  మరి ఆయన ఏం చేశారో తెలుసా?

‘‘మంత్రికే ఇటువంటి ఇసుక సరఫరా చేస్తే ఇక సామాన్యుల సంగతేంటి?‘‘ అని మీడియా ముందు నటించారు.

వాస్తవానికి ఇది ప్రజలు, మీడియా అడగాల్సిన సందేహం. తప్పులు జరగకుండా పరిశీలించాల్సిన వారే అయ్యో అయ్యో అని అంటే... అసలు దీనిని ఎలా అర్థం చేసుకోవాలో అంతుచిక్కని పరిస్థితి. వైసీపీ అధికారంలోకి రాగానే ఆ పార్టీ నేతలలాగే అధికారులు వింతగా ప్రవర్తిస్తున్నారు. 

ఇంతకు మించి దీని గురించి మనం ఏం చెప్పగలం? ఎవరి కర్మకు ఎవరు బాధ్యుడు అనుకోవడం తప్పు. మంత్రికి కల్తీ ఇసుక పంపితే ఇక ఏపీలో ఇసుక కష్టాలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.