కదిలించే వీడియో : ఏపీలో ఇసుక ఘోరాలు

July 01, 2020

ఇసుక కొరత ఏపీ రాష్ట్రాన్ని తీవ్రంగా కుదిపేస్తుంది. ముఖ్యమంత్రి పదవిలో జగన్ కి సుఖం లేకుండా చేస్తోంది. చిత్రమైన విషయం ఏంటంటే... ఇసుక వల్ల ఉపాధి కోల్పోయిన వారిల అత్యధికులు జగన్ అభిమానులు, ఓటర్లు. దీంతో జగన్ ఇసుక విషయంలో చేసిన తప్పు... అతని పార్టీ బేస్ ను కదిలించింది. 

ముఖ్యమంత్రి అనుభవ రాహిత్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సారి భవన నిర్మాణ రంగం స్తంభించింది. అసలే మాంద్యంతో, ప్రభుత్వ మార్పుతో విలవిల్లాడుతున్న రియల్ ఎస్టేట్ రంగం, ఇసుక దెబ్బతో కుక్క చావు చచ్చింది. వ్యాపారులు, వినియోగదారులే కాకుండా... ఆ రంగంలోని 20 లక్షల కార్మికులు, ఈ వ్యాపారం మీద ఆధారపడిన మరో 50 లక్షల మంది ప్రత్యక్ష, పరోక్ష స్వయం ఉపాధి వర్గాలు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదర్కొన్నాయి. రాష్ట్రంలో పరిస్థితికి అద్దంపట్టే కొందరి కార్మికుల ఆవేదనకు ఈ వీడియో నిలువెత్తు సాక్ష్యం.