సీక్రెట్‌- సానియా చెల్లెలిది మొద‌టి పెళ్లి కాదా?

May 25, 2020

మాజీ క్రికెట‌ర్, కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ అజారుద్దీన్ త‌న‌యుడు, ప్ర‌ముఖ క్రీడాకారిణి సానియామీర్జా కుటుంబం ఆస‌క్తిక‌ర వార్త‌తో తెర‌మీద‌కు వ‌చ్చింది. అజారుద్ధీన్ కుమారుడు అసద్ పెళ్లి సానియా మిర్జా చెల్లెలితో జరగబోతుంది.  25ఏళ్ల అసద్.. 28ఏళ్ల ఆనమ్‌లు తమ మధ్య ఉన్న బంధాన్ని  పెళ్లిగా మార్చుకోబోతున్నట్లు చెబుతున్నారు. సానియా చెల్లెలికి ఇది రెండో వివాహం. 

సానియా సోద‌రి ఆనమ్‌ మిర్జా ఇప్ప‌టికే  వివాహం అయింది. 2016లో అక్బర్‌ రషీద్‌ను వివాహం చేసుకుంది. వీరి పెళ్లి హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. అయితే తన మాజీ భర్త అక్బర్ రషీద్‌ నుంచి గతేడాది ఆనమ్ విడాకులు కోసం దరఖాస్తు చేసుకోగా.. ఇటీవల వారికి విడాకులు మంజూరు అయినట్లు తెలుస్తుంది. విడాకుల అనంతరం అసద్‌తో ఆనమ్ సన్నిహితంగా మెలుగుతుంది. వీరి ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్లలో కనిపిస్తున్న కొన్ని పోటోలను చూస్తుంటే వీరి నిఖా పక్కా అయినట్లేన‌ని మీడియాలో వార్త‌లు వ‌స్తున్నాయి.

మ‌రోవైపు, అసద్-ఆనమ్ ప్రేమను వారి కుటుంబాలు కూడా వీరి పెళ్లికి ఒప్పుకున్నట్లు చెబుతున్నారు. అయితే, వాళ్ల కుటుంబాలు మాత్రం ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. ఈ ఏడాది ఆఖరిలో ఇద్దరూ పెళ్లి చేసుకోనునట్లు తెలుస్తోంది. ఈ వివాహంతో ఇద్ద‌రు క్రీడాకారుల కుటుంబాలు ఒక్క‌టి కానున్నాయి.