అమరుడా !జోహార్--హరి శింగలూరి 

August 12, 2020

మంచుకొండ మండించి
మరణాన్నే ఎదిరించిన
చైనీయుల దండించి
శౌర్యాన్నే పండించిన
సూర్యపేట సూరీడా!
సింగానికే సరిజోడా!!
ఊదితే ఆరిపోయే
దీపం కాదయ్యా నీ ఊపిరి
బూదితో ముగిసిపోయే
కాయం కాదయ్య నీ ధ్యేయం
సూర్యచంద్రులుండుదాక
చెరిగిపోని చరిత నీది!
తెలుగు గడ్డ!తెలుగు బిడ్డ
మరవలేని ఘనత నీది!
(వీరజవాన్ సంతోష్ బాబుకు నివాళిగా--హరి శింగలూరి)

 

RELATED ARTICLES

  • No related artciles found