సుశాంత్ గురించి సంచలన ట్వీటేసింది

August 05, 2020

బాలీవుడ్ లో ఒక హీరోకు, అది కూడా ధోని వంటి సినిమా తీసిన హీరోకు కష్టాలుంటాయా?

ఇది ఎవరూ ఊహించలేదు కానీ నిజం. బాలీవుడ్ హీరో సుశాంత్ మరణం గురించి అందరూ కలత చెందేవారే.

అతన్ని ఎవరైనా బతికిస్తామంటే కోట్లివ్వడానికి రెడీగా ఉన్నట్లు చాలామంది ట్వీట్లు చూసినపుడు అనిపిస్తుంది.

కానీ అది కూడా నటనే అని ఈరోజు హెయిర్ స్టైలిస్ట్ స్వప్న బావ్నాని (Celebrity Hair stylist Sapna Bhavnani) చేసిన ట్వీట్ తో తేలిపోయింది.

  సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ సప్నా భావ్నాని చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఆమె సుశాంత్ ఎంతో కాలంగా కష్టాల్లో ఉన్నట్టు చెప్పింది.

అయినా ఎవరి నుంచీ అతనికి అండ దొరకలేదని ఆమె వాపోయింది.

'కొన్నేళ్లుగా సుశాంత్ కష్ట కాలాన్ని అనుభవిస్తున్నాడు. ఇది అందరికీ తెలుసు.

అతనికి ఇండస్ట్రీలో ఎవరూ నిలబడలేదు. నిలబడరు. సినీ పరిశ్రమలో వ్యక్తిత్వాలు అలాంటివి. దానికి సుశాంత్ ఆత్మహత్యే ఉదాహరణ.

ఇక్కడ ఉన్న ఎవరూ నీ స్నేహితులు కాదు. నీ ఆత్మకు శాంతి చేకూరాలి' అంటూ సప్న ట్వీట్ ఇపుడు వైరల్ అవుతోంది. 

ఈ ట్వీట్ ను బట్టి అతను పరిష్కారం దొరికే అవకాశం ఉన్న సమస్యల వల్లే మరణించినట్లు చాలా స్పస్టంగా తెలుస్తోంది. ఇది అత్యంత బాధాకరం.

ఇండ స్ట్రీని ఒక కుటుంబం అని చెప్తారు. కానీ ఎవరూ కుటుంబ సభ్యుల్లా వ్యవహరించరు. ఇతరులను పిలిచి పార్టీలు ఇవ్వడం పేరు కోసమే కానీ ఆత్మీతతో కాదు. 

టాలీవుడ్లోను ఇదే సమస్య. మహానుభావుడు జంధ్యాల కుటుంబం గురించి, వెలుగు వెలిగి ఇబ్బంది పడుతున్న ఇంకెందరి గురించి సినీ పరిశ్రమ పట్టించుకుందా? ఏదో నామ్ కే వాస్తేకే పట్టించుకుంటుంది. 

ఇదంతా పరిశ్రమ కాదు... ఒక భ్రమ.  

Image