శ‌ర‌వ‌ణ భ‌వ‌న్ ఓన‌ర్‌కు జీవిత ఖైదు !

August 09, 2020

శ‌ర‌వ‌ణ భ‌వ‌న్ త‌మిళ‌నాడులోనే కాదు... దేశంలోనే పాపుల‌ర్ రెస్టారెంటు. రుచిక‌ర‌మైన ఆహారానికి చిరునామాగా చాలామంది చెబుతుంటారు. ఎంతో శ్ర‌మ ఉంటే గాని అది ఈ స్థాయికి రాలేరు. కానీ అత‌నికి సంప‌ద‌తో పాటు చెడుబుద్ధి కూడా పెరుగుతూ వ‌చ్చింది. అందుకే రెండు పెళ్లిళ్లు చేసుకున్న రాజ‌గోపాల్ (శ‌ర‌వ‌ణ భ‌వ‌న్ ఓన‌ర్‌) త‌న వ‌ద్ద ప‌నిచేసే ఓ అసిస్టెంట్ మేనేజ‌ర్ కూతురి మీద మోజు ప‌డ్డాడు.
ఆమె పేరు జీవ‌జ్యోతి. త‌న‌న పెళ్లి చేసుకోమ‌ని అనేకసార్లు రాజ‌గోపాల్ బ‌ల‌వంతం చేశాడు. చివ‌ర‌కు బెదిరింపుల‌కు దిగాడు. అయితే, రెండు పెళ్లిళ్లు అయిన రాజ‌గోపాల్‌ను చేసుకోవ‌డం జ్యోతికి ఇష్టం లేదు. ఆమె వేరే ఒక వ్య‌క్తిని పెళ్లి చేసుకుంది. దీనిని రాజ‌గోపాల్ జీర్ణించుకోలేక‌పోయాడు. విడాకులు తీసుకోవాల‌ని బ‌ల‌వంతం చేశాడు. అయినా విన‌క‌పోవ‌డంతో భ‌ర్తను కిడ్నాప్ చేసి చంపేశారు.
ఈ కేసులో జీవ‌జ్యోతి గెలిచింది. రాజ‌గోపాల్ కు మ‌ద్రాస్ హైకోర్టు జీవిత ఖైదు వేసింది. 2009లోనే ఈ శిక్ష ప‌డింది. బెయిలు కూడా వ‌చ్చింది. మ‌ళ్లీ రాజ‌గోపాల్ సుప్రీంకోర్టుకు వెళ్ల‌గా అత‌నికి విధించిన శిక్ష స‌రైన‌దే అని తేల్చింది. దీంతో శ‌ర‌వ‌ణ ఓన‌ర్ ఇక జైలు జీవితం గ‌డ‌పాల్సిందే. దీన్ని బ‌ట్టి శ‌ర‌వ‌ణ భ‌వ‌న్ భ‌విష్య‌త్తు ఎలా ఉంటుందో చూడాలి. 

చ‌రిత్ర పున‌రావృతం అయ్యింది... ఓ స్త్రీ మోజులో ప‌డి మ‌రో సామ్రాజ్య అధినేత కూలిపోయాడు.