డిసెంబరు 31 కి మహేష్ బాబు గిఫ్ట్ భలే ఉందే

May 26, 2020

2019 వెళ్లిపోతోంది. ఇక రెండే రోజులు. కొందరికి బాధ, కొందరికి సంతోషం. కొందరికి నష్టం, కొందరికి లాభం. కాలం ఎవరి కోసం ఆగదు. మరో రెండు రోజుల్లో మనం కొత్త కేలండర్లోకి అడుగుపెడుతున్నాం. అందరూ కొత్త లక్ష్యాలు రాసుకుంటున్నారు. కొన్ని చిన్నవి, కొందరి లక్ష్యాలు పెద్దవి. కష్టమొచ్చినా, నష్టమొచ్చినా డిసెంబరు 31 జరుపుకోవాల్సిందే... కొత్త ఏడాదికి ఘన స్వాగతం పలకాల్సిందే. మరి ఒక అదిరిపోయే పాట వేసుకుంటే ఎలాగుంటుంది? అవును... కదా.

మీకోసం మహేష్ బాబు మంచి పాట గిఫ్ట్ ఇస్తున్నాడు. మామూలు పాట కాదు... పార్టీ పాట. ఇంతవరకు ఐటెం సాంగులు, స్ట్రెయిట్ సాంగులు రెండే ఉండేవి. తాజాగా మహేష్ బాబు పార్టీ సాంగ్ చూస్తారా అంటూ మురిపించి శాంపిల్ వదిలాడు. సాంగ్ అదిరింది. సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం తీసిన ఈ సాంగ్ షార్ట్ వీడియో కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. తమన్నా స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చిన ఈ సాంగ్ మాస్, క్లాస్ ఇద్దరినీ సంతోష పెట్టేలా ఉంది. మీరూ ఓ సారి చూసేయండి. డిసెంబరు 31 న పాటేసుకుని రెచ్చిపోండి.