పంచాయతీ పెట్టి తేల్చారు.. మహేష్ ఫస్ట్ 

July 15, 2020

ఈ సంక్రాంతి పందెం రాయుళ్ల కంటే టాలీవుడ్ హీరోల హడావుడి ఎక్కువగా కనిపిస్తోంది. అంచనాలు అధికంగా ఉన్న పెద్ద సినిమాలు ఈసారి ఎక్కువగా ఉన్నాయి. సూపర్ స్టార్, స్టైలిష్ స్టార్ తో పాటు ఇంకా చాలామంది సంక్రాంతికి సై అంటున్నారు. అయితే... మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమా విడుదల డేట్ల మధ్య పెద్ద గొడవ అయ్యింది. ఇద్దరు 12వ తేదీకి పట్టుబట్టారు. దీంతో దీనిపై పంచాయతీని ప్రొడ్యూసర్ గిల్డ్ దాకా తీసుకెళ్లారు. చివరకు ఈ సమస్య పరిష్కారం అయ్యింది.

మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాను ఒకరోజు ముందుకు తీసుకెళ్లారు. అంటే జనవరి 12న రావాల్సిన మహేష్ సినిమా ఒక రోజు ముందుగా 11వ తేదీ వస్తోంది. మరుసటి రోజు త్రివిక్రమ్ - అల్లు అర్జున్ సినిమా అల వైకుంఠ పురంలో విడుదల కానుంది. దీంతో ఎగ్జిబిటర్లు, పంపిణీ దారులు కూడా సంతోషం వ్యక్తంచేశారు. రెండు చిత్రాల నిర్మాతలు అనిల్ సుంకర, చినబాబుల ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయాన్ని అంగీకరించారు.