స‌రిలేరు నీకెవ్వ‌రు.. సీన్ బై సీన్ చెప్పేస్తున్నారే

May 26, 2020

టాలీవుడ్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు ఒక ఫార్మాట్ ఉంటుంది. క‌థ ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ ఎలా ఉండాలి.. తొలి పాట ఎలాంటిదై ఉండాలి.. ఇంట‌ర్వెల్ బ్యాంగ్ ఎలా సెట్ చేయాలి.. క్లైమాక్స్ ఎలా తీర్చిదిద్దాలి అనే విష‌యాల్లో ఒక ఫార్మాట్‌ను ఫాలో అయిపోతుంటారు క‌మ‌ర్షియ‌ల్ డైరెక్ట‌ర్లు. సంక్రాంతికి రాబోయే స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమా విష‌యంలో అనిల్ రావిపూడి కూడా ఈ స్ట‌యిలే ఫాలో అయిన‌ట్లున్నారు. ఇప్ప‌టికే రిలీజ్ చేసిన వివిధ ప్రోమోల‌తో ఈ సినిమా క‌థాక‌థ‌నాల‌పై ఒక అంచ‌నా ఉండ‌గా.. తాజాగా వ‌చ్చిన ట్రైల‌ర్ చూశాక మ‌రింత క్లారిటీ వ‌చ్చింది. ఇవ‌న్నీ చూశాక సోష‌ల్ మీడియా జ‌నాలు ఈ సినిమా ఎలా న‌డ‌వొచ్చ‌నే దానిపై రిపోర్ట్ స‌మ‌ర్పించేస్తున్నారు.
వాళ్ల అంచ‌నా ప్ర‌కారం స‌రిలేరు నీకెవ్వరు సినిమా క‌శ్మీర్లో మొద‌ల‌వుతుంది. అక్క‌డ టెర్ర‌రిస్టులు ఇండియా మీద దాడి లాంటిది ప్లాన్ చేస్తుంటే.. హీరో అక్క‌డ అడుగుపెడ‌తాడు. త‌న టీంతో క‌లిసి స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ లాంటిది చేసి త‌న ఆగ‌మ‌నాన్ని ఘ‌నంగా చాటుతాడు. త‌ర్వాత టైటిల్ సాంగ్ వ‌స్తుంది. ఆపై మిలిట‌రీ సెట‌ప్‌లోనే కొన్ని స‌న్నివేశాలు న‌డిచాక త‌న స‌హ‌చుర‌ల‌తో క‌లిసి పార్టీ చేసుకునే క్ర‌మంలో త‌మ‌న్నాతో డాంగ్ డాంగ్ పాట వ‌స్తుంది. ఆపై సెల‌వు మీద హీరో స్వ‌స్థ‌లానికి బ‌య‌ల్దేర‌తాడు. ఆ క్ర‌మంలో ట్రైన్ ఎపిసోడ్ మొద‌లువుతంది. హీరోయిన్‌తో రొమాంటిక్ సీన్స్, కామెడీతో అర‌గంట గ‌డుస్తుంది. మ‌ధ్య‌లో హీ ఈజ్ సో క్యూట్ పాట వ‌స్తుంది. ఇంట‌ర్వెల్ ముంగిట‌ హీరో క‌ర్నూల్లో అడుగు పెడ‌తాడు. అప్పుడే విజ‌య‌శాంతి, ప్ర‌కాష్ రాజ్ పాత్ర‌లు రంగ ప్ర‌వేశం చేస్తాయి. కొండారెడ్డి బురుజు ఫైట్‌తో ఇంట‌ర్వెల్ బ్యాంగ్. విజ‌య‌శాంతికి ప్ర‌కాష్ రాజ్ వ‌ల్ల ఇబ్బందులు ఎదుర‌వుతుంటే.. హీరో అనుకోకుండా విల‌న్‌తో క‌య్యం పెట్టుకుని ఆ త‌ర్వాత ఆమె స‌మ‌స్య‌ను టేక‌ప్ చేస్తాడు. ఈ క్ర‌మంలో వ‌చ్చే డ్రామాతో ద్వితీయార్ధం న‌డుస్తుంది.

మ‌ధ్య‌లో ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కు న‌చ్చేలా మ‌హేష్‌, విజ‌య‌శాంతి మ‌ధ్య బంధాన్ని ఎస్టాబ్లిష్ చేసే స‌న్నివేశాలు.. సూర్యుడివో చంద్రుడివో పాట‌.. ఆపై ప్రి క్లైమాక్స్ ముంగిట హీరోయిన్ రీఎంట్రీ, ఆమెతో రొమాన్స్, మైండ్ బ్లాక్ పాట‌.. ప్రి క్లైమాక్స్‌లో ఒక ట్విస్ట్, ఒక భారీ ఫైట్‌తో క్లైమాక్స్.. ఇలా ఈ సినిమా న‌డుస్తుంద‌ని నెటిజ‌న్లు అంచ‌నా వేస్తున్నారు. మ‌రి ఈ అంచ‌నాల‌కు భిన్నంగా అనిల్ ఏమైనా సినిమాను న‌డిపిస్తాడేమో చూడాలి.