మహేష్ బాబుకి జ్జానోదయం అయ్యింది...అందుకే

August 03, 2020

ఈరోజు ఏ మీడియాలో చూసినా ’సర్కారు వారి పాటే‘ నడుస్తోంది

సామాజిక మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది. మిలియన్లీ కొద్దీ పోస్టులతో ఇంటర్నెట్ షేక్ అవుతోంది. మహేష్ బాబుతో దర్శకుడు పరశురాం తీస్తున్న సినిమా టైటిల్ పోస్టరు రిలీజ్ చేయడంతో మహేష్ బాబు అభిమానులకు పండగొచ్చింది. పోస్టరు నిజంగానే అదిరిపోయింది. మహేష్ బాబు లుక్ ని ఇది రివీల్ చేసింది. 

ఈ లుక్ తో మహేష్ బాబుకు జ్జానోదయం అయినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. 

మహేష్ బాబుకి జ్జానోదయం అవడం ఏంటి నీకేమైనా పిచ్చా అనుకోవచ్చు. ఖలేజా వంటి రఫ్ సినిమా మొదలుకొని ప్రతి సినిమాలో మహేష్ బాబు ఒకటే రొడ్డ కొట్టుడు స్టైలు. జెంటిల్ మెన్ డ్రెస్సింగ్ లో వేరియేషనే లేకుండా ప్రతి సినిమాలో ఒక సంపన్నుడిలా సాగిపోతాయి మహేష్ పాత్రలు. ఇది జనాల్లో బాగా చర్చ నడుస్తోంది. మహేష్ మారడా... ఇంతేనా. ఎందుకిలా అని కొందరు విమర్శకులు విసుక్కున్నారు.

ఎట్టకేలకు మహేష్ బాబు మారాడామో, ఫీడ్ బ్యాక్ ఆయన దాకా వెళ్లిందేమో అనిపించేలా ఉంది పోస్టరు. చెవిలో రింగు, పొడుగాటి రఫ్ స్టైల్ జుట్ట, మెడ మీద రూపాయి టాటూ ఇవి మాత్రమే కనిపించినా.. ఈ లుక్ తో మహేష్ బాబుది శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి వంటి రొటీన్ గెటప్ కాదని అర్థమైపోయింది.

అదే క్రమంలో సినిమా టైటిల్ కూడా మాంచి మాస్ మసాలా అనిపించేలా ఉంది. ఇది అలాంటి సినిమానో కాదో తెలియదు కాది అలాంటి సినిమా కావాలని కోరుకుందాం. ఇన్నాళ్లకు లుక్ మొత్తం మార్చుకునే ప్రయత్నం చేసిన మహేష్ బాబుకు నమస్తే ఆంధ్ర అభినందనలు.