సరోజ్ ఖాన్ .. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ మృతి

August 04, 2020

ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్(71) కార్డియాక్ అరెస్ట్ వల్ల గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత రెండు గంటల సమయంలో మరణించారు.
శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతుండడంతో జూన్ 17న ఆమెను ముంబయిలోని గురునానక్ ఆసుపత్రిలో చేర్పించారు.
కరోనా వైరస్ టెస్టులు కూడా జరిపించగా నెగటివ్ వచ్చింది.
72 ఏళ్ల సరోజ్ ఖాన్‌కు భర్త సోహన్ లాల్, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

సరోజ్ ఖాన్ అసలు పేరు నిర్మల కిషన్ చంద్ సాధు సింగ్ నాగ్ పాల్. దాదాపు 2000కు పైగా సినిమాలకు నృత్య దర్శకత్వం చేశారు సరోజ్.
మూడేళ్ల వయసులోనే బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించిన సరోజ్ ఖాన్ అంచెలంచెలుగా ఎదిగి గొప్ప కొరియోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్నారు.
మిస్టర్ ఇండియాలోని హవాహవా పాట నుంచి ‘చోలీ కే పీచే క్యా హై’ సహా 2002లో దేవదాస్ సినిమాలోని ‘డోలా రే డోలా రే’’ పాట వరకు వందలాది పాటలకు గొప్ప నృత్య దర్శకత్వం చేసి పేరు తెచ్చుకున్నారు.

డ్యాన్స్ అంటే పిచ్చి

సరోజ్ ఖాన్‌కు చిన్నతనం నుంచే డ్యాన్స్ అంటే పిచ్చి. మూడేళ్లకే బాలీవుడ్‌లో అడుగు పెట్టారామె. 

డ్యాన్స్ చేయాలన్న ఆమె విపరీతమైన కోరికను చూసి ఇదేమైనా పిచ్చా అన్న అనుమానంతో ఆమె తల్లి డాక్టరు వద్దకు తీసుకెళ్లింది.

ఆ డాక్టర్ సరోజ్‌లోని తపనను గుర్తించి ఆమెను డ్యాన్స్ చేయనివ్వండి అని తల్లిదండ్రులకు చెప్పడమే కాకుండా తనకు పరిచయం ఉన్న బాలీవుడ్ వ్యక్తులకు సరోజ్ గురించి చెప్పారు. దాంతో బాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. మొదట ఒక బాల నటిగా చిన్న పాత్ర దొరికింది.

ఆ తరువాత చాలా వేషాలొచ్చాయి. 10 ఏళ్లకు నేను గ్రూప్ డాన్సర్ అయిన ఆమెను అక్కడికి రెండేళ్ల తరువాత  ప్రముఖ కొరియోగ్రాఫర్లు హీరాలాల్, సోహన్‌లాల్‌ తమ అసిస్టెంట్‌గా నియమించుకున్నారు.

తరువాత కొద్ది రోజులకే సరోజ్ డ్యాన్స్ మాస్టర్‌గా మారారు.