ట్విట్టర్ స్టార్ కి ఎంత కష్టమొచ్చిందంటే !

July 12, 2020

రోటీన్ రాజ‌కీయకుడికి భిన్నంగా.. మేధావి వ‌ర్గానికి చెందిన నేత‌గా పేర్కొనే సీనియ‌ర్ కాంగ్రెస్ నేత క‌మ్ మాజీ కేంద్ర మంత్రి శ‌శిథ‌రూర్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఆయ‌న‌కు జ‌రిగిన ప్ర‌మాదమే విచిత్ర‌మ‌ని చెప్పాలి. కేర‌ళీయులు ఘ‌నంగా జ‌రుపుకునే కేర‌ళీయుల నూతన సంవ‌త్స‌ర వేడుక‌లైన విషు ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ఒక దేవాల‌యంలో ఆయ‌న తులాభారానికి కూర్చున్నారు.
తులాభారానికి కూర్చున్నంత‌నే త్రాసు గొలుసు తెగింది. దీంతో.. ఆయ‌న త్రాసులో నుంచి కింద ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న తంప‌నూర్ ప్రాంతంలోని గాంధారి అమ్మ‌న్ కోవిళ్ ఆల‌యంలో చోటు చేసుకుంది. ఈ ప్ర‌మాదంలో శ‌శిథ‌రూర్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఆయ‌న త‌ల‌కు ఆరు కుట్లు ప‌డ్డాయి. ప్ర‌స్తుతానికి గండం గ‌ట్టెక్కినా.. దెబ్బ‌లుమాత్రం గ‌ట్టిగా త‌గిలిన‌ట్లుగా చెబుతున్నారు. గాయ‌మైన వెంట‌నే ఆయ‌న్ను ద‌గ్గ‌ర్లోని ఆసుప‌త్రికి త‌రించారు.
తిరువ‌నంత‌పురం లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఇప్ప‌టికి రెండుసార్లు ఎంపీగా గెలిచిన ఆయ‌న‌.. తాజా ఎన్నిక‌ల్లోనూ అదే స్థానం నుంచి బ‌రిలోకి దిగారు. ఈ ఎన్నిక‌ల్లో ఆయ‌న ప్ర‌త్య‌ర్థులుగా బీజేపీ.. సీపీఎం నేతృత్వంలోని ఎల్ డీఎఫ్ అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు. ఈ దెబ్బ‌ల‌తో ఆయ‌న ఎన్నిక‌ల ప్ర‌చారంలో యాక్టివ్ గా ప్ర‌చారం చేయ‌టానికి ఇబ్బందిగా మారుతుంద‌ని భావిస్తున్నారు.  

RELATED ARTICLES

  • No related artciles found