బాబుపై వెటకారం చేసినోళ్లు... ఇపుడు తలదించుకుంటారా మరి?

February 23, 2020

ఏదైనా విషయం మీద ఎటకారం చేసినప్పుడు వినేందుకు.. చదివేందుకు బాగుంటుంది. ఎటకారం మహిమ అలాంటిది. ఎటకారం చేసినోడి మేథోతనం మనిషికి ఉండాల్సిన విచక్షణను చంపేస్తుంది.  అతగాడు చెప్పింది నిజమే అనిపిస్తుంది. అయితే.. ఎటకారం పేరుతో వాస్తవాల్ని తమకు అనుగుణంగా వక్రీకరిస్తారన్న సత్యాన్ని చాలామంది మర్చిపోతారు. వేలెత్తి చూపించటం.. విమర్శించటం.. ఎదుటోడ్ని తప్పు పట్టే ధోరణి వ్యక్తిగత స్థాయిలో అయితే జరిగే నష్టం అంతో ఇంతో అన్నట్లు ఉంటుంది.
కానీ.. పాలకులకు ఈ గుణం ఉంటే నష్టం ఎంత దారుణంగా ఉంటుందో తాజాగా మండపేట విషాదాన్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. దోమల వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి జగన్ అండ్ కో చేసిన ఎటకారంఅంతా ఇంతా కాదు. దోమల్లో ఆడదోమ.. మగదోమల్ని లెక్కించాలట.. అందుకోసం కోట్లు ఖర్చు చేశారు.. దోమల పేరుతో స్వాహా చేశారంటూ చంద్రబాబును ఆడిపోసుకున్న జగన్ అండ్ కో తాజాగా అదే దోమకారణంగా చోటు చేసుకున్న డెంగ్యూతో ఒక కుటుంబం బలి అయిపోవటాన్ని ఏమనాలి? ఎవరిని తప్పు పట్టాలి? అన్నది ప్రశ్న.
చంద్రబాబు సర్కారుతో దోమల వ్యాప్తిని అరికట్టేందుకు చేపట్టిన చర్యల్ని ఎటకారం చేసుకోవటమే కాదు.. ఇలా ఖర్చు చేయటం ఏమిటని ప్రశ్నించిన జగన్ పరివారం.. తమ హయాంలో పెరిగిన డెంగ్యూ మరణాల మీద ఏమని సమాధానం చెబుతారు? డెంగ్యూ జ్వరంతో తానెంతగానో ప్రేమించే భార్య మరణించటంతో.. దాన్ని భరించలేని భర్త.. తన చిన్నారి కుమార్తెతో కలిసి ఆత్మహత్య చేసుకున్న వైనం రాష్ట్రంలో సంచలనంగా మారింది.
దోమ.. దోమ అంటూ చాలా చిన్న విషయంగా తేల్చేసిన జగన్ సర్కారు.. మరి అదే దోమ కారణంగా వస్తున్న డెంగ్యూ జ్వరాల్ని ఎందుకని కంట్రోల్ చేయలేకపోతున్నారు? అన్నది క్వశ్చన్. ఎటకారం ఆడుకోవాలి.. అది రాజకీయ అంశాల మీద. ప్రజా సమస్యల మీద అడ్డగోలు రాజకీయాల్నితీసుకొస్తే.. అమాయకులు మరణించటమే కాదు.. ఎన్నో కుటుంబాల్లో అంతులేని శోకంతో నిండిపోతుందన్న విషయం ఇప్పటికైనా సీఎం జగన్ కు .. ఆయనకు వంతపాడేందుకు సదా సిద్ధంగా ఉండే వారు మనసుతో ఆలోచిస్తే మంచిదేమో?

RELATED ARTICLES

  • No related artciles found