హైదరాబాదుకు సత్య నాదెళ్ల 

August 08, 2020

ప్రపంచ ప్రసిద్ధ కంపెనీ గూగుల్ సీఈవో బాధ్యతల్లో ఉన్న సత్య నాదెళ్ల తండ్రి బుక్కాపురం నాదెళ్ల యుగంధర్ మరణించారు. ఈయన మాజీ ఐఏఎస్ అధికారి. 1962 బ్యాచ్‌కు చెందిన యుగంధర్‌ సుదీర్ఘ కాలం సేవలు ప్రభుత్వంలో సేవలు అందించారు. పీవీ నర్సింహారావు ప్రధానమంత్రిగా ఉన్నపుడు పీఎంవో కార్యదర్శిగా ఉన్నారు. ప్రణాళిక సంఘం సభ్యుడిగా పనిచేశారు. బ్యూరోక్రాట్లలో మంచి పేరు సంపాదించారు.

హైదరాబాదులో నివసిస్తన్న ఆయన 80 ఏళ్ల వయసులో వృద్ధాప్య సమస్యలతో ప్రాణాలు విడిచారు.సత్య నాదెళ్ల గూగుల్ సీఈవో అయిన తర్వాత మరోసారి యుగంధర్ వార్తలోకి వచ్చారు. యుగంధర్  బీఎన్‌ యుగంధర్‌ కుటుంబానిది అనంతపురం జిల్లా యల్లనూరు మండలం బుక్కాపురం. ఊరిపేరే ఇంటి పేరు అయ్యింది. ఉద్యోగంలో భాగంగా ఢిల్లీలో ఎక్కువ కాలం గడిపిన యుగంధర్ కుటుంబం... రిటైర్ మెంట్ తర్వాత హైదరాబాదులో సెటిలైంది. 

సత్య నాదెళ్ల తల్లి ప్రభావతి 2015లో మరణించారు. తండ్రి ఈరోజు మరణించారు. తండ్రి అంత్యక్రియల కోసం ఆయన హైదరాబాదు వస్తున్నారు. తల్లిదండ్రి ఇద్దరు చనిపోవడంతో సత్య నాదెళ్లకు ఇక హైదరాబాదుతో సంబంధాలు దాదాపు తెగిపోయినట్లే.