కొత్త మొబైల్ రెమిటెన్స్ యాప్‌ను ఆవిష్క‌రించిన ఎస్‌బీఐ కాలిఫోర్నియా

August 08, 2020

మొబైల్ బ్యాంకింగ్ ఆర్థిక లావాదేవీల ప్ర‌క్రియ‌ను స‌మూలంగా మార్చివేసిన సంగ‌తి తెలిసిందే. దాదాపు 75% వినియోగ‌దారులు ఈ స‌దుపాయాన్ని వినియోగించుకుంటున్నారు. ఇలాంటి త‌రుణంలో...ఎస్‌బీఐ కాలిఫోర్నియా వారు త‌మ విలువైన వినియోగ‌దారుల కోసం...కొత్త మొబైల్ రెమిటెన్స్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. వినియోగ‌దారుల‌కు సౌక‌ర్యంగా ఉండేలా, వేగంగా లావాదేవీలు పూర్త‌య్యేలా ఈ యాప్‌ను తీర్చిదిద్దారు. 24 గంట‌ల పాటు అందుబాటులో ఉండేలా, వేగంగా, సుర‌క్షితంగా మ‌రియు సౌక‌ర్య‌వంతంగా సేవ‌లు పూర్త‌య్యేలా ఈ యాప్‌ను  బ్యాంక్ అధికారులు పొందుప‌ర్చారు.
ఈ యాప్ లాంచ్ సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 30వ తేదీ లోపు 100 అమెరికా డాల‌ర్ల‌కు మించి చేసే అన్ని లావాదేవీల‌పై 25 పైస‌లు అధ‌నంగా పొందే సౌల‌భ్యాన్ని క‌ల్పించారు. ఈ యాప్ యొక్క గ‌రిష్ట ప‌రిమితి రోజుకు $ 5000 అమెరిక‌న్ డాల‌ర్లు. నెల‌కు $ 25,000 డాల‌ర్లు. స‌మ‌గ్ర స‌మ‌చారం కోసం www.sbical.com వెబ్‌సైట్ సంద‌ర్శించ‌వ‌చ్చు లేదా 1- 877-707-1995 నంబ‌రుకు కాల్ చేయ‌వ‌చ్చు.