సింగపూర్ లో కండోమ్ ల కొరత... కారణమే షాకింగ్ !

August 15, 2020

వినేందుకు విచిత్రంగా ఉన్నప్పటికి ఇది నిజం. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని ఊరికే అనలేదు. కొవిడా (కరోనా) వైరస్ ప్రభావంతో ప్రజలు ఎంతటి భయాందోళనలకు గురి అవుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన దేశంలో కొవడా వైరస్ ప్రభావం తక్కువే. కానీ.. సింగపూర్ లో కొవడా వైరస్ భయం చాలానే ఉంది. దీనికి తగ్గట్లే కొన్ని కేసులు బయటకు రావటంతో.. అక్కడి ప్రజలు ముందస్తు జాగ్రత్తల విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉంటున్నారు.
కరోనా వైరస్ తమ దరికి చేరకుండా ఉండటానికి ఎన్ని మార్గాలు ఉంటే అన్నింటిని ఫాలో అవుతున్నారు. కరోనా వైరస్ ప్రబల కుండా ఉండేందుకు తలుపు హాండిల్స్.. లిఫ్ట్ లలో ప్రయాణించే సమయంలో వాటిని నేరుగా తాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా గ్లౌజ్ లు చేతికి తొడుక్కుంటున్నారు. కొవిడా వైరస్ విషయంలో సింగపూర్ ప్రభుత్వం ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు. దీంతో.. అక్కడి ప్రజలు భయాందోళనలకు గురి అవుతున్నారు.
ఇదిలా ఉంటే.. వైరస్ అంటకుండా ఉండేందుకు.. లిప్టులో ప్రయాణించిన ఒక వ్యక్తి వేలికి కండోమ్ ను పెట్టుకొని.. లిఫ్టు బటన్ ను ప్రెస్ చేస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఐడియా సింగపూర్ ప్రజలకు పిచ్చ పిచ్చగా నచ్చింది. అంతే.. వారు కండోమ్ లను వేళ్లకు తొడుక్కొని లిఫ్టు బటల్ ను నొక్కేందుకు వినియోగిస్తున్నారు. దీంతో.. ఇప్పుడా దేశంలో కండోమ్ లకు విపరీతమైన డిమాండ్ రావటమే కాదు.. కొరత కూడా ఏర్పడిన పరిస్థితి.  కండోమ్ లు దొరకటం లేదన్నంతనే.. మాయదారి వైరస్ మీదకు వచ్చి పడుతున్నా.. సెక్స్ మీద ఆలోచనలు తగ్గలేదా? అన్న సందేహం పలువురిలో కలుగుతుంది. కానీ.. అలాంటిదేమీ లేకుండా.. కేవలం ముందస్తు జాగ్రతలో భాగంగా వినియోగిస్తున్న కండోమ్ లకు సింగపూర్ లో మస్తు డిమాండ్ ఉన్నట్లు చెబుతున్నారు.