రెడ్డిగారిని చూస్తే... దొరకు తడిసిపోతోందే

July 07, 2020

తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరు కావాలంటూ నవ్యాంధ్ర నూతన ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆహ్వానించేందుకు వచ్చిన తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు వ్యవహార సరళి ఆశ్చర్యం కలిగించిందనే చెప్పాలి. సోమవారం మధ్యాహ్నం విజయవాడలో దిగిన కేసీఆర్.. తొలుత కనకదుర్గమ్మను దర్శించుకుని ఆ తర్వాత నేరుగా తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లారు.

ఈ సందర్భంగా కేసీఆర్ కు సాదర స్వాగతం పలికేందుకు జగన్ తన ఇంటి నుంచి బయట ఉన్న పోర్టికో వద్దకు వచ్చారు. కేసీఆర్ కారు దిగగానే.. పుష్పగుచ్ఛాలు అందించి సాదరంగానే ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ముఖ కవళికలు, వ్యవహరించిన తీరు చూస్తుంటే... ఏదో భయంభయంగానే జగన్ నివాసానికి వచ్చినట్టుగా కనిపించారు. జగన్ కు నమస్కారం పెడుతున్నప్పుడు వంగి మరీ దండం పెట్టడం ఇందుకు నిదర్శనమని చెప్పాలి. తను నమస్కారం పెట్టేటప్పుడు జగన్ నిటారుగానే నిలుచున్నా... కేసీఆర్ మాత్రం చాలా వంగి మరీ దండం పెట్టారు.

ఈ దృశ్యాన్ని చూస్తుంటే... జగన్ అంటే కేసీఆర్ కు బాగానే భయం పట్టుకుందన్న విశ్లేషణలు మొదలయ్యాయి. ఓ వైపు ప్రధాని నరేంద్ర మోదీతో సఖ్యత లేకపోవడం, మరోవైపు తన వెనుకే నిలబడతాడని భావించిన జగన్... తాజా ఎన్నికల్లో ఏ ఒక్కరూ ఊహించని మెజారిటీతో ఇటు అసెంబ్లీలోనే కాకుండా అటు లోక్ సభలోనూ హ్యాండ్ ఫుల్ ఆఫ్ సీట్స్ దక్కించుకోవడం చూసిన కేసీఆర్... జగన్ ముందు వినయం ప్రదర్శించినట్టుగానే చెప్పుకోవాలి. ఏ ఒక్కరికీ తలవంచని రీతిలో వ్యవహరిస్తున్న కేసీఆర్... జగన్ వద్ద వంగి వంగి దండాలు పెట్టడం చూస్తుంటే... ఏ రీతిన లెక్కలేసుకున్నా... జగన్ తనకంటే మెరుగ్గానే ఉన్నాడని, ఏ క్షణాన ఏ ముప్పు పొంచి ఉంటుందోనన్న భయంతోనే జగన్ కు కేసీఆర్ సాగిలపడినట్లుగా విశ్లేషణలు సాగుతున్నాయి.