సీఎం జగన్‌కు మరో రెండు బూమరాంగ్‌లు రెడీయా

August 13, 2020

పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తానని ఏపీ ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

అయితే... దానిని స్వచ్ఛంగా, వివాదరహితంగా అమలు చేయడంలో తీవ్రంగా విఫలమయ్యారు.

వివాదాస్పద భూములను ఎంచుకోవడం, అధిక ధరలకు భూములు కొన్నారని ఆరోపణలు రావడంతో అది కోర్టులో ఇరుక్కుంది.

ఇప్పటికే అనేక సార్లు వాయిదా పడిన ఈ కార్యక్రమానికి కొత్త తేదీ ప్రకటించారు వైఎస్ జగన్. 

ఆగస్టు 15న ఈసారి కచ్చితంగా ఇస్తానని చెబుతున్నారు.

ఎవరు అడ్డువచ్చినా ఆగను అన్నట్లు చెబుతున్నారు. అయితే... కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులు వీగిపోతే అది సాధ్యమే  కానీ.. ఏపీ సర్కారు వాదనల్లో ఓడిపోతే ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదాపడటం గ్యారంటీ.

అది ఎవరి చేతుల్లోను లేదు. అయినా మరో తేదీని ప్రకటించడం వెనుక వాయిదా పడితే మంచిదే టీడీపీ మీద నెపం నెట్టి ఆ పార్టీని బదనాం చేయొచ్చనే ప్రణాళికతో ఈ వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది.

ఇక సెప్టెంబరు 5న పాఠశాలలు ప్రారంభం అవతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్  తాజాగా ప్రకటించారు.

ఆగస్టు 31 తేదీ నాటికి పాఠశాలల్లో నాడు-నేడు పనులు పూర్తి కావాలని ఆదేశాలు జారీ చేశారు.

రాష్ట్రంలో చాలా స్కూళ్లలో వసతులు మెరుగు పరిచి పాఠశాలలు అభివృద్ధి పరిచారు.

అయితే, కరోనా వల్ల స్కూలే లేకుండా పోయింది. ఎలాగైనా స్కూలు ప్రారంభించాలని, తన పథకం జనాలకు చూపించి పేరు తెచ్చుకోవాలని జగన్ తపిస్తున్నారు.

కానీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న అంచనాల ప్రకారం అప్పటికి కేసులు పెరుగుతాయే గాని  తగ్గే అవకాశమే లేదని చెబుతున్నారు.

ఈ లెక్కన స్కూలును సెప్టెంబరు 5న ప్రారంభించే ఉండకపోవచ్చు.

సెప్టెంబరు 5 అంటే అది ఎంతో దూరంలో లేదు. ఇంకో నెలా పది రోజులు.

అంతలోపు కరోనా కంట్రోల్ అయ్యే అవకాశం తక్కువ. కాబట్టి జగన్ ప్రకటించిన తాజా నిర్ణయం అమల్లోకి రాకపోవచ్చు.. స్కూళ్లు తెరవలేని పరిస్థితి ఉండొచ్చు.