సియాటెల్‌లో అట్ట‌హాసంగా టాటా బ‌తుక‌మ్మ సంబురాలు

August 13, 2020

4000 మందికి పైగా ప్ర‌జ‌లు...ఆక‌ట్టుకునే రీతిలో తీర్చిదిద్దిన బ‌తుక‌మ్మలు...ఆడ‌బిడ్డ‌ల సంబురాలు...స్థానికుల సంద‌డి...ఇది టీఏటీఏ సియాటెల్ బ‌తుక‌మ్మ సంబురాల యొక్క ప‌రిచ‌యం. టీఏటీఏ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ వంశీరెడ్డి సార‌థ్యంలో, బోర్డ్ ఆఫ్ డైరెక్ట‌ర్స్ న‌వీన్ గోలి, ప్ర‌దీప్ మెట్టు, ఆర్‌వీపీలు గ‌ణేష్‌, మ‌నోహ‌ర్‌, నిక్షిప్త‌, అజ‌య్ మ‌రియు ఆర్‌సీలు శ్రీ‌కాంత్ మ‌రియు శివ సార‌థ్యంలో టీఏటీఏ సియాటె్ టీం బ‌తుక‌మ్మ పండుగ‌ను అట్ట‌హాసంగా మ‌రియు క‌న్నుల పండువగా నిర్వ‌హించింది.

స్థానిక తెలంగాణ‌ సంఘ‌మైన డ‌బ్ల్యూఏటీఏ (వాషింగ్ట‌న్ తెలంగాణ అసోసియేష‌న్)తో మ‌రియు తెలుగు సంఘ‌మైన డ‌బ్ల్యూఏటీఎస్ (వాషింగ్ట‌న్ తెలుగు అసోసియేష‌న్) స‌మ‌న్వ‌యం చేసుకొని టీఏటీఏ ఈ కార్య‌క్ర‌మం నిర్వ‌హించింది.
యాంక‌ర్ అన‌సూయ ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసి తెలుగు ప్ర‌జ‌ల‌తో క‌లిసి కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. అన‌సూయ ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డంతో విచ్చేసిన వారంద‌రూ ఎంతో సంతోషించారు. ఉల్లాసంగా ఆమె స్థానికుల‌తో క‌లిసి ఆడిపాడారు. తెలంగాణ‌కు చెందిన యూకే సింగ‌ర్ స్వాతి ఈ కార్య‌క్ర‌మానికి మ‌రో ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు. సంప్ర‌దాయ‌మైన మ‌రియు ఆక‌ర్ష‌ణీయ‌మైన బ‌తుక‌మ్మ పాట‌ల‌తో ఆహుతుల‌ను ఆమె ఆక‌ట్టుకున్నారు.
బ‌తుక‌మ్మ ఆట‌పాట‌ల‌తో మ‌హిళ‌లు క‌లిసిపోయారు. ఏడు అడుగుల బ‌తుక‌మ్మ ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. బోథెల్ వాలంటీర్ల బృందం స్వ‌యంగా ఈ బ‌తుక‌మ్మ‌ను తీర్చిదిద్దింది.
రెడ్‌మండ్ బృందం యొక్క డోల్ చ‌ప్పుళ్ల ర్యాలీ ఈ కార్య‌క్ర‌మానికి హైలెట్‌గా నిలిచింది. కార్య‌క్ర‌మానికి విచ్చేసిన వారు, వాలంటీర్లు మ‌రియు నిర్వాహ‌కులు ఉత్సాహ‌వంతంగా చేప‌ట్టిన కార్య‌క్రమాల‌తో సంబురాలు ఆక‌ర్ష‌ణీయంగా సాగాయి. ఈ కార్య‌క్ర‌మం జ‌రిగిన తీరు ప‌ట్ల ఎంతో సంతోషం వ్య‌క్తం చేసిన విచ్చేసిన వారు...రాబోయే కాలంలోనూ ఇదే రీతిలో క‌న్నుల పండువ‌గా సంబురాలు నిర్వ‌హించాల‌ని ఆకాంక్షించారు.