తెలంగాణ సచివాలయం - ఈ డౌటు నిజమే

October 17, 2019

కేసీఆర్ పంతం పట్టిన కొత్త సచివాలయ నిర్మాణం హైదరాబాదు చుట్టూ రౌండ్లు వేసి చివరకు పాత సచివాలయంలోనే శంకుస్థాపన చేసుకుంది. ఈరోజు అందరు ఎమ్మెల్యేల సమక్షంలో శంకుస్థాపన ఘనంగా నిర్వహించారు కేసీఆర్. దశమి రోజు ముహూర్తం చూసుకుని మరీ శంకుస్థాపన చేశారు. అయితే, ఈ సందర్భంగా కాంగ్రెస్ కు ఓ ధర్మ సందేహం వచ్చింది.
అసలు సచివాలయం మొహం చూడని ముఖ్యమంత్రికి పాతదైనా? కొత్తదైనా? ఎందుకు... ఖర్చే అనవసరం కదా అని ప్రశ్నించింది. నిజమే... తన గత ఐదేళ్ల పాలనలో ఏనాడూ కేసీఆర్ సచివాలయానికి రాలేదు. రెండోసారి గెలిచాక కూడా అక్కడికి రాలేదు. మరి అలాంటపుడు అన్ని కోట్లు ఖర్చుపెట్టి ఎందుకు కడుతున్నారు అని కాంగ్రెస్ అడుగుతోంది. సచివాలయానికి వచ్చే సీఎం అయితే కొత్తది కట్టుకున్నా ఒక ముచ్చట. కానీ దాని మొహం చూడని కేసీఆర్ కు కొత్తది అయినా, పాతది అయినా ఒకటే కదా. కనీసం డబ్బులు అయినా మిగులుతాయి అంటోంది కాంగ్రెస్.
అయినా కేసీఆర్ తన ఇల్లు కట్టుకోవడం లేదు, కడుతోంది సచివాలయమే కదా, మీకెందుకు అంత బాధ అని తమపై వస్తున్న విమర్శలను కూడా కాంగ్రెస్ గట్టిగా తిప్పికొట్టింది. కాంగ్రెస్ కు కేసీఆర్ లాగా మూఢ నమ్మకాలు ఏం లేవని, మేము అధికారంలోకి వస్తే మాకు పాత సచివాలయంంతో ఎలాంటి ప్రాబ్లం లేదు. కొత్త సచివాలయంతో ప్రజలకు నష్టం తప్ప మరో ఉపయోగం ఏమీ లేదని కాంగ్రెస్ అంటోంది. నిజమే కదా. వాస్తు పిచ్చి ఇంత మంది ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ కే ఉంది. ఆ సచివాలయంలో చంద్రబాబు 9 సంవత్సరాలు వరుసగా పాలించారు.