టీటీడీ బోర్డులో జగన్ బినామీ !!

July 04, 2020

లాజిక్ అనేది ఇతరుల నోరు మూయించడానికి తప్ప దేనికీ పనికిరాదు. మహా అయితే పోలీసులు కేసులు చేదించడానికి ఒక్కోసారి ఉపయోగపడుతుందేమో. చిత్రం ఏంటంటే... లాజిక్ తో ఎవరిని ఎలా అయినా ఇరికించివచ్చు. దీనిని బలంగా నమ్మిన అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. నోట్ల రద్దు సమయంలో తమిళనాడుకు చెందిన శేఖర్ రెడ్డి పట్టుబడితే... వెంటనే బాబు బినామీ అని ఆరోపించారు. అప్పట్లో సీబీఐ సోదాల్లో శేఖర్ రెడ్డి వద్ద భారీ మొత్తంలో డబ్బు పట్టుబడింది. కేవలం అతను చంద్రబాబు హయాంలో టీడీపీ మెంబర్ అయ్యాడన్న ఏకైక లాజిక్ ను పట్టుకుని శేఖర్ రెడ్డి... చంద్రబాబు బినామీ అని ఆరోపించారు వైఎస్ జగన్. దీనిని తన స్వంత సోషల్ మీడియా అక్కౌంట్లో పోస్టు చేశారు.  2014లో బాబు తన బినామీ అయిన శేఖర్ రెడ్డి టీటీడీ బోర్డు మెంబరుగా అందుకే నియమించాడు అంటూ జగన్ తన ఫేస్ బుక్ అక్కౌంట్లో రాసుకున్నారు. 

అబద్ధాలు అంటేనే నోటికొచ్చినట్లు మాట్లాడేవి. అందుకే బాబును విమర్శించే క్రమంలో జగన్ రెడ్డినే తప్పు పట్టింది సాక్షి పత్రిక. సాక్షి ట్విట్టరు అక్కౌంటులో ఇంకో ఆరోపణ చేశారు. లోకేష్ కు 100 కోట్లు చెల్లించి శేఖర్ రెడ్డి టీటీడీ సభ్యుడు అయ్యారు అంటూ అంబటి ఆరోపించిన వార్తను సాక్షి ప్రచురించింది. శేఖర్ రెడ్డి చంద్రబాబు బినామీ అయితే... పదవి కోసం లోకేష్ కు వంద కోట్లు ఎందుకు ఇస్తాడు? ఇది మినిమమ్ కామన్ సెన్స్. జగన్ చెప్పింది కరెక్టా? అంబటి చెప్పింది కరెక్టా? లేదా ఇద్దరూ నోటికొచ్చిన అబద్ధాన్ని చెప్పారా?

కట్ చేస్తే... ఇపుడు అదే శేఖర్ రెడ్డికి జగన్ రెడ్డి టీటీడీ బోర్డులో ప్రత్యేక ఆహ్వానితుడి పదవి ఇచ్చారు. జగన్ అపుడు చంద్రబాబు పై వాడిన లాజిక్ ప్రకారం... ఇపుడు శేఖర్ రెడ్డి జగన్ రెడ్డి బినామీనా? లేక అంబటి లాజిక్ ప్రకారం... జగన్ రెడ్డికి లేదా భారతి రెడ్డికి వంద కోట్లు లంచమిచ్చి టీటీడీ పదవి పొందారా? 

పార్టీ అధ్యక్షుడి మాట పార్టీ మాటగా తీసుకోవాలి కాబట్టి... జగన్ లాజిక్ ప్రకారమే... శేఖర్ రెడ్డి జగన్ రెడ్డి బినామీ. ఇద్దరు హైలీ రెస్పెక్టెడ్ వర్గం కదా మరి!! 

నోట్ - అప్పటి క్లిప్పింగులు కింద స్లైడ్ షోలో ఉన్నాయి గమనించగలరు.