స‌మంత‌లో ఆ విష‌యం ఎక్కువేన‌ట‌!

February 23, 2020

రోటీన్ కు భిన్నంగా చేయ‌ట‌మే స‌మంత స‌క్సెస్ సీక్రెటా? అంటే అవుననే చెప్పాలి. గ్లామ‌ర‌స్ హీరోయిన్  ఇమేజ్ తో పాటు.. టాప్ హీరోల‌తో  వ‌రుస సినిమాలు చేస్తూ బిజీబిజీగా ఉన్న వేళ‌లో హ‌టాత్తుగా పెళ్లి పీట‌ల‌కు ఎక్కేయ‌టం ఎవ‌రైనా ఊహించ‌గ‌ల‌రా?  పెళ్లి త‌ర్వాత కూడా గ్లామ‌ర‌స్ పాత్ర‌కు పెద్ద‌గా అభ్యంత‌రం పెట్ట‌ని వైనాన్ని జీర్ణించుకోగ‌ల‌రా?  
ఇదంతా ఒక ఎత్తు అయితే.. బ్యూటీగా కోట్లాది మంది మ‌న‌సుల్ని దోచేసిన వేళ‌..డీ గ్లామ‌ర్ పాత్ర‌ను  చేసేందుకు ఓకే అన‌టం ఒక ఎత్తు అయితే.. ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌కు సై అన‌టం స‌మంత‌కు మాత్ర‌మే సాధ్య‌మేమో? ఇలా ఎప్ప‌టిక‌ప్పుడు రోటీన్ కు భిన్నంగా వ్య‌వ‌హ‌రించే ఆమె తీరుతో కోట్లాది మంది ఆమె అంటే విప‌రీత‌మైన అభిమానాన్ని ప్ర‌ద‌ర్శిస్తుంటారు. 
తాజాగా ఆమె న‌టించిన ఓ బేబీ చిత్రం అనూహ్య విజ‌యం సాధించ‌టం ఒక ఎత్తు అయితే.. న‌ట‌న ప‌రంగా ఆమెను మ‌రోస్థానానికి వెళ్లేలా చేసింది. ఇప్ప‌టివ‌ర‌కూ ఆమె చేసిన సినిమాలు ఒక ఎత్తు అయితే.. ఈ సినిమా మ‌రో ఎత్తు అన్న‌ట్లుగా ఆమె న‌ట‌న ఈ సినిమాలో ఉంద‌న్న కితాబులు బోలెడ‌న్ని స‌మంత‌కు వ‌చ్చాయి. ఆమెలో ఏదైనా నేర్చుకోవాల‌న్న ప‌ట్టుద‌ల చాలా ఎక్కువ‌న్న విష‌యాన్ని చెప్పారు సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మీ. 
ఓబేబీ సినిమాలో మీ హావ‌భావాలు అనుక‌రించాల్సిందిగా స‌మంత‌కు ఏమైనా స‌ల‌హాలు ఇచ్చారా? అని అడిగితే.. తాను ఎవ‌రి స‌ల‌హాలైనా తీసుకోవాలే కానీ.. తాను స‌ల‌హాలు ఇచ్చే ప‌రిస్థితా? అంటూ ఒద్దిక‌గా స‌మాధానం చెప్పిన ఆమె.. స‌మంత‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర విష‌యాన్ని వెల్ల‌డించారు.
ఒక రోజు సెట్ కు వ‌చ్చిన స‌మంత త‌న‌ను చూస్తూఉండిపోయిన విష‌యాన్ని చెప్పారు ల‌క్ష్మీ. మీరు ఇలా కాళ్లు ఊపుకుంటూ నిలుచున్నారు.. నేను అలా నిలుచుంటా అని.. త‌న‌ను అనుక‌రించేప్ర‌య‌త్నం చేసింద‌న్నారు. ఇలా త‌న‌పాత్ర‌కు సంబంధించి కొత్త విష‌యాల్ని నేర్చుకోవాల‌న్న ప‌ట్టుద‌ల స‌మంత‌లో తాను గుర్తించిన‌ట్లు చెప్పారు. మొత్తానికి కొత్త విష‌యం ఏదైనా.. త‌న‌కు అవ‌స‌ర‌మైన దాన్ని తెలుసుకోవ‌టం.. నేర్చుకునే వ‌ర‌కూ విడిచిపెట్ట‌క‌పోవ‌టం లాంటివి స‌మంతో ఎక్కువ‌న్న విష‌యం తాజాగా స్ప‌ష్ట‌మైంద‌ని చెప్పాలి.