కొత్త ఐడియా - మామిడి తోటలో సెక్స్ రాకెట్

August 03, 2020

మనదేశంలో వ్యక్తిగత వ్యభిచారం నిషేధం కాదు, కానీ అమ్మాయిలను సమీకరించి ఒక వ్యాపారంగా నిర్వహిస్తే అది నిషేధం. పైగా అమ్మాయిలను నిందితులుగా చూడరు. దీంతో విటుల మీద ఆధారపడిన ఈ వ్యాపారం చాలా జాగ్రత్తగా పోలీసులకు దొరక్కుండా చేస్తుంటారు. ఎప్పటికపుడు నివాసాలను మారుస్తూ దొరక్కుండా చూస్తుంటారు. ప్రస్తుతం వాట్సప్ లోనే బేరం కుదిరిపోతుంది. ఫొటో సెలక్షన్ కూడా అక్కడే జరుగుతుంది. ఒప్పందం అయ్యాక కలుసుకుంటారు. అయితే, తాజాగా శ్రీకాకుళంలో దీనికి భిన్నమైన సెక్స్ రాకెట్ ఒకటి పట్టుబడింది. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
శ్రీకాకుళం జిల్లా పరిధిలోని జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న మామిడి తోట(నరసన్నపేట సమీపంలో)ను హబ్ గా మార్చుకున్నారు వ్యభిచార గృహ నిర్వహకులు. రాజమండ్రి ప్రాంతం నుంచి అక్కడికి అమ్మాయిలను తెచ్చి మామిడి తోటలనే అన్నీ కానిచ్చేస్తున్నారు. ముగ్గురు అమ్మాయిలు అక్కడ అందుబాటులో ఉన్నారు. చుట్టు పక్కల కాలేజీల్లో చదివే కుర్రాళ్లే వీరి టార్గెట్. ముందే అంతా సెట్ చేసుకున్న నిర్వహకులు రాత్రిపూట టైం సెట్ చేసి అందరికీ లొకేషన్ పంపారు. ఈ విషయం తెలిసిన వారు ఎవరోపోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడులు నిర్వహించారు.
20 మంది యువకులు, ముగ్గురు అమ్మాయిలు ఈ దాడిలో పట్టుబడ్డారు. వీరంతా పోలీసుల అదుపులో ఉన్నారు. విటులంతా కాలేజీ స్టూడెంట్సే. దీనికి కారణం టిక్ టాక్, వీగో వీడియోలు, పోర్న్ వీడియోలే కారణం అంటే... అందులో ఎంత మాత్రం సందేహం లేదు. ఇవి కాలేజీ విద్యార్థుల ఆలోచనలను కలుషితం చేస్తున్నారు. వారి దృష్టిని మరల్చి కోరికను పెంచుతున్నాయి. డబ్బు అందబాటులో ఉండే పిల్లలు సులువుగా దీనికి అలవాటు పడుతున్నారు. తల్లిదండ్రులు పిల్లల విషయంలో చాలా జాగ్రత్త పాటించకపోతే ప్రమాదానికి దారితీస్తుంది ఈ పరిణామం.