సెక్స్ రాకెట్ లో పట్టుబడిన ముగ్గురు నటీమణులు... తర్వాతేమైంది?

August 03, 2020

ముంబయిలోని త్రీస్టార్ హోటల్లో సాగుతున్న హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్ ను పోలీసులు గుర్తించిన వైనం సంచలనంగా మారింది. ఈ సెక్స్ రాకెట్ లో పలువురు మహిళల్ని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. చిత్రపరిశ్రమకు చెందిన వారు ఉన్నట్లు గుర్తించారు. అయితే.. ఈ రాకెట్ సూత్రధారి 29 ఏళ్ల ప్రియాశర్మను తాజాగా పోలీసులు అరెస్టు చేశారు.
తమకు ఇష్టం లేకున్నా బలవంతంగా.. ఒత్తిడితో వ్యభిచారం చేయిస్తున్న ముగ్గురు నటీమణులను ఆ నరకం నుంచి విముక్తి కల్పించారు ముంబయి పోలీసులు. ఈ ముగ్గురిలో ఒకరు మైనర్ నటి ఉండటం గమనార్హం. అంధేరీలోని త్రీ స్టార్ హోటల్లో జరిపిన తనిఖీల్లో ఈ సెక్స్ రాకెట్ గుట్టు రట్టైంది.
టూర్స్ అండ్ ట్రావెల్స్ బిజినెస్ చేసే ప్రియాశర్మ పలువురిని మాయమాటలతో.. బలవంతంగా వ్యభిచారం రొంపిలోకి దింపుతున్నట్లు గుర్తించారు. అనైతిక కార్యకలాపాలకు పాల్పడే ఆమె నేర చరిత్రను తవ్వుతున్నారు. ఇదిలా ఉంటే.. పోలీసులు రక్షించిన ముగ్గురు నటీమణుల్లో ఒకరు ప్రముఖ టీవీ చానల్ నిర్వహించే క్రైం షోలో పని చేస్తున్నట్లు గుర్తించారు. మరొకరుమరాఠీ చిత్రాల్లోనూ.. సీరియల్స్ లోనూ నటిస్తున్నారు.పోలీసులకు పట్టబడ్డ మైనార్టీ నటి కూడా ఒక వెబ్ సిరీస్ లో నటిస్తున్న విషయాన్ని గుర్తించారు. ఈ వ్యవహారం ముంబయి సినీ వర్గాల్లో చర్చకు తావిచ్చింది.