లోకేష్ ల‌క్ష్యంగా ష‌ర్మిళ ప్ర‌చారం

July 04, 2020

ఏపీలో మంగ‌ళ‌గిరి అసెంబ్లీ సెగ్మెంట్ ఇప్పుడు అంద‌రి ద‌`ష్టిని ఆక‌ర్షిస్తుంది. ఇక్క‌డ సీఎం చంద్ర‌బాబునాయుడు కుమారుడు మంత్రి లోకేష్ పోటీ చేయ‌డ‌మే ఇందుకు కార‌ణం. టీడీపీలో కీల‌క నేతగా వ్య‌వ‌హ‌రించిన లోకేష్ ఎమ్మెల్సీ తీసుకొని తండ్రి కెబినెట్‌లో మంత్రిగా చేరారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో తొలిసారి ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల్లో పోటీకి దిగాడు. మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేస్తున్నాడు. తొలి ఎన్నిక‌లు కావ‌డంతో లోకేష్ చాలా ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్నాడు. బాబు కూడా లోకేష్ గెలుపు బాధ్య‌త పార్టీలో కీల‌క నేత‌ల చేతిలో పెట్టార‌ట‌. వారే లోకేష్ ప్ర‌చారం తీరును గ‌మ‌నిస్తూ ఎప్ప‌టిక‌ప్పుడు లోటు పాట్లను స‌రిచేయ‌డంతో శ్రేణుల‌ను ఉత్సాహ ప‌రిచే ప‌నిలో ఉన్నార‌ట‌. గెలుపు కోసం ఎంత ఖ‌ర్చు పెట్టిన ప‌ర్వాలేద‌ని అదినేత భ‌రోసా కూడా ఇవ్వ‌డంతో టీడీపీ ప్ర‌చారంలో వేగం పెంచింది.

ఇదిలా ఉంటే 2014లో వైసీపీ నుండి గెలుపొందిన ఆళ్ల రామకృష్టారెడ్డి అప్పుడు కేవలం 12 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. అతడు కూడా స్వంత ఖర్చులతో సంక్షేమ పథకాలు ప్రారంభించి మంగళగిరి ప్రజల్లో సానుభూతిని సంపాదించుకున్నాడు. రాజన్న క్యాంటిన్ పేరుతో కేవలం 4 రూపాయలతో కోడిగుడ్డుతో సహా భోజనం పెట్టడం, 10 రూపాయలకు 7 రకాల కూరగాయలను పట్టణ ప్రజలకు అందించడం వల్ల అతనిపై కూడా ప్రజల్లో సానుకూలత ఉంది. ఆళ్ల‌కు చెక్ పెట్టేందుకే బాబు వ్యూహాత్మ‌కంగా లోకేష్‌ను బ‌రిలోకి దించుకున్న‌ట్టు ఓ టాక్ న‌డుస్తోంది. ఇప్పుడు వైసీపీ కూడా ఈ సీటు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకుంది. ఈ క్రమంలోనే వైసీపీ అధ్యక్షుడు జగన్ సోదరి షర్మిలను రంగంలోకి దించ‌బోతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతుంది. షర్మిల ఇప్పటికే ప్రెస్ మీట్ పెట్టి మరీ నారా లోకేష్‌ని తీవ్రంగా విమర్శించింది. ఇప్పుడు ఏకంగా మంగళగిరి నుండే తన ప్రచారాన్ని మొదలుపెట్టనుంది. షర్మిల రాకతో మంగళగిరి రాజకీయం మరింత వేడెక్కింది.

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వా నేనా అని పోటీ పడే నియోజకవర్గాల్లో మంగళగిరి మొదటి స్థానంలో నిలవనుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అభ్యర్థులు అందరూ తన విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్ర‌మంలో లోకేష్‌కు బ్రేకులు వేసేందుకు జ‌గ‌న్ సోద‌రి ష‌ర్మిళ‌పై ఆశ‌లు పెట్టుకున్నార‌ట‌. సీఎం కుమారుడిని ఓడిస్తే టీడీపీని దెబ్బ‌తీయ‌వ‌చ్చ‌నేది జ‌గ‌న్ దీమా. కాని ష‌ర్మిళ మాట‌లు మంగ‌ళ‌గిరి ఓట‌ర్ల‌ను ఎంత వ‌ర‌కు ప్ర‌భావితం చేస్తుందో అనే అంశం పై ఆస‌క్తి నెల‌కొంది.ఆళ్ల చేస్తున్న స‌మాజ సేవ‌కు తోడు ష‌ర్మిళ ప్ర‌చారం వైసీపీ గెట్టేక్కిస్తుందా లేదా అనే దాని పై స‌ర్వ‌త్రా చ‌ర్చ‌ణీయాంశంగా మారింది.