సీన్లోకి వచ్చిన షర్మిల

June 02, 2020

జగన్ మంత్రులు కొడుతున్న డబ్బా చాలదు అన్నట్లు వైఎస్ షర్మిల సీన్లోకి వచ్చింది. మా అన్న తండ్రికంటే తోపు ... అని కీర్తించింది. ఇపుడు ఎందుకు? కొంపదీసి కరోనా ప్రెస్ మీట్ కి కాదు కదా ఈ పొగడ్తలు అనుకున్నారేమో. కాదు కాదు... జగన్ ప్రారంభించిన విద్యాదీవెన పథకాన్ని ఆమె తెగ పొగిడేశారు.

'నాన్న గారు ఒక అడుగు ముందుకేస్తే.. పేదవాడికి మేలు చేయడానికి నేను రెండు అడుగులు ముందుకేస్తా'నని @ysjagan అన్న మాటిచ్చారు.ఆ పేదవాడికి మేలు చేయడంలో తండ్రిని మించిన తనయుడిగా నిలిచారు. అన్న ప్రారంభించిన ' ' చరిత్రలో నిలిచిపోతుంది  అంటూ ట్విట్టర్లో కీర్తించారు. ఈ ట్వీటుతో పాట, ఈ రెండు పథకాల గురించి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ రెడ్డి చేసిన ఆ పథకాల స్పీచ్ లను కూడా ఆమె జత చేశారు. 

అయితే, ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. వైఎస్ పెట్టిన ఫీజు పథకంలో కాలేజీలకు డబ్బులు పంపేవారు. కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా ఆ బాధలేవో కాలేజీలు పడేవి. అయితే, జగన్ వ్యూహాత్మకంగా ఈ పథకం డబ్బులు కాలేజీలకు ఇవ్వకుండా తల్లిదండ్రులకు ఇస్తానని ప్రకటించారు. అంటే వైఎస్ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వంలో ఏదైతే జరిగిందో అదే డబ్బులే జగన్ ఇస్తున్నారు... కానీ కాలేజీలకు ఇవ్వాల్సిన డబ్బులను తల్లిదండ్రులకు ఇస్తున్నారు జగన్. ఇంతకు మించి ఈ పథకంలో కొత్తదనం ఏం లేదు.

వాస్తవానికి జగన్ స్కీంలో జగన్ కి కావల్సింది నెరవేరుతుంది గాని కొందరు విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ముందు తల్లిదండ్రుల చేతికి డబ్బులు వస్తే పొరపాటున ఏ అత్యవసరాలకో వాడేస్తే విద్యార్థి చదువు ఆగిపోయే ప్రమాదం ఉంది. అంటే జగన్ డబ్బులిస్తున్నాడు. కాలేజీలకు, గవర్నమెంట్లకు సంబంధం లేదు. అంటే ఇక నుంచి ఆ తలనొప్పి విద్యార్థులదే. గవర్నమెంటు లేటుగా కనుక రిలీజ్ చేస్తే ఇక ఆ విద్యార్థికి కాలేజీ నుంచి టార్చర్ తప్పదు. ఒకవేళ ఏ తాగుబోతు తండ్రో ఉంటే ఇంక ఆ విద్యార్థి పరిస్థితి ఘోరం. ఇక ఎపుడైతే గవర్నమెంట్లు సంబంధం లేదో... కాలేజీలు ఇతర ఫీజుల గురించి అడగడం మొదలుపెడతాయి. అవి విద్యార్థి తలమీద పడతాయి.

ఇంకో విషయం... కాలేజీలకు ఇస్తే జగన్ తనకు కావాల్సిన వారికి మాత్రమే పథకం వర్తింపజేసే ఛాన్స్ ఉండదు. జగన్ వేసిన ఐడియాలో తనకు నచ్చని కమ్మ, కాపు కులస్తులను, తెలుగు దేశం అభిమానులకు డబ్బు ఇవ్వకుండా వేధించినా అడిగేవాడుండడు. ఒక్కమాటలో చెప్పాలంటే... ఇంతకాలం అందరికీ వర్తించిన పథకం...జగన్ కొందరికే చేశాడు.