ఆ పార్టీ లైఫ్ టైం మిస్టేక్ చేసింది

July 12, 2020

ఇంతకాలం తనకంటూ ప్రత్యేకతను నిలుపుకున్న శివసేన పార్టీ నైతిక ఓటమి, ఓడిపోయి గెలవాలనుకున్న బీజేపీ వ్యూహం రెండూ ఒకేసారి నెరవేరే పరిస్థితులు మహారాష్ట్రలో కనిపిస్తున్నాయి. బీజేపీ - శివసేన పొత్తు ఎన్నికల ముందు కుదిరింది. కానీ బీజేపీ మోసాన్ని ఎన్నికల ముందు కాకుండా రిజల్టు వచ్చాక బయటపెట్టడంతో శివసేన వైపు న్యాయం ఉన్నా కూడా శివసేన వైఖరి ఆ పార్టీ నైతికతను ప్రశ్నించేలా చేసింది. అదే సమయంలో బీజేపీకి అనుకోని బంపరాఫర్ ను కట్టబెట్టింది శివసేన. తక్కువ సీట్లు వచ్చిన తమకు ముఖ్యమంత్రి పదవి అడగడం కచ్చితంగా బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ అవుతాయి. దానిబదులు కాస్త ఎక్కువ మంత్రి పదవులు అడిగినా బానే ఉండేది. అయితే... శివసేన అడ్డం తిరగడంతో ఏ రాష్ట్రంలోనూ తలవంచని బీజేపీ ఇక్కడ వెనక్కు తగ్గి ప్రభుత్వ ఏర్పాటు మా వల్ల కాదు అని ప్రకటించింది. 

బీజేపీ వేసిన వెనుకడుగుతో పైకి బీజేపీ ఓడినట్టు మనకు కనిపిస్తున్నా... ప్రజల్లో బీజేపీపై సానుభూతిని పెంచింది. లోపల ఏం జరిగినా పైకి మాత్రం శివసేనది దురాశ అని జనం భావించే పరిస్థితి. పైగా తాము కాదంటే... ఆ పార్టీ ఎన్సీపీ, కాంగ్రెస్ లతో మాత్రమే కలిసే అవకాశం ఉంది. ఆ ఒక్కటి ీజరగాలన్నదే బీజేపీ అభిలాష. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో కలిస్తే... శివసేన కచ్చితంగా కొంత ఓటుబ్యాంకు, కొంత క్యాడర్ కోల్పోతుంది. వారికి కచ్చితంగా బీజేపీయే వేదిక అవుతుంది. అంటే శివసేన ఒక తప్పుటడుగు వేసి తాను బలహీనపడుతూ బీజేపీని బలపడేలా చేస్తోంది. శివసేన కనుక ఎన్సీపీ, కాంగ్రెస్ లతో కలసిి ప్రభుత్వం ఏర్పాటుచేస్తే... శివసేన కోర్ దెబ్బతింటుంది. అదే జరిగితే బీజేపీ అక్కడ అత్యధికంగా లాభపడుతుంది.

మరో కోణం ఏంటంటే... బీజేపీ లేకుండా ప్రభుత్వం ఏర్పాటుకాావలంటే... మిగతా మూడు పార్టీలు కావాలి. ఆ మూడు పరస్పర విరుద్ధమైన పార్టీలు. శివసేన ఎలాగైనా కాంగ్రెస్ తో కలిసి చెడిపోవాలన్నదే బీజేపీ ఆకాంక్ష అనడంలో వేరే సందేహం లేదు. చిట్ట చివరకు ఈ మూడు పార్టీల ప్రభుత్వ ఏర్పాటుప్రయత్నం విఫలమవుతుంది. అదే జరిగితే గవర్నర్ పాలన ద్వారా మహారాష్ట్ర బీజేపీ చేతిలోకే వస్తుంది. అంటే... బీజేపీతో శివసేన అనవసర కయ్యం పెట్టుకుందన్నమాట.