వైసీపీ నేతల్లో పాపులర్ కామన్ పాయింట్ ... వెరీ క్రేజీ

February 17, 2020

గ‌త కొద్దికాలంగా ఏపీ ప్ర‌తిప‌క్ష నేత‌, టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడుపై అధికార వైసీపీ నేత‌లు చేస్తున్న వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారిన సంగ‌తి తెలిసిందే. సీనియ‌ర్ ప్రజాప్రతినిధి అనే గౌర‌వం ఇవ్వ‌కుండా  సభ్యత, సంస్కారం మ‌రిచి వైసీపీ నేత‌లు మాట్లాడే తీరును చూసి అనేక‌మంది విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. తెలుగుదేశంలో రాజ‌కీయ బిక్ష పొందిన వారు సైతం ఇప్పుడు వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ పంచ‌న చేరి చేస్తున్న ఈ విమ‌ర్శ‌ల‌పై టీడీపీ సీనియ‌ర్ నేత శోభారాణి ఘాటుగా స్పందించారు
ఓ మీడియా సంస్థ‌తో మాట్లాడిన శోభారాణి  వైసీపీ నేతల మాట తీరును ప్రజలు గమనిస్తున్నారని, రౌడీలకు పాలనాధికారం ఇస్తే ఏం జరుగుతుందో తెలుసుకుంటున్నారని అన్నారు. టీడీపీలో ఉన్న స‌మ‌యంలో హుందాగా వ్య‌వ‌హ‌రించిన నేత‌లు ఇప్పుడు చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేయ‌డం చూస్తుంటే...వైసీపీ బూతు పార్టీ అందులో చేరిన వారంతా...ఇలాగే బూతులు మాట్లాడేందుకు పోటీ ప‌డ‌తార‌నే భావ‌న క‌లుగుతోంద‌ని ఆమె వ్యాఖ్యానించారు. రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు స‌హ‌జ‌మ‌ని పేర్కొన్న శోభారాణి అవి ప్ర‌జ‌లు ఆమోదించే విధంగా ఉండాలే కానీ...వారు ఛీకొట్టేలా ఉండ‌వ‌ద్ద‌న్నారు.
వైసీపీ అధ్యక్షుడు ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గురించి ఆ పార్టీ నేత‌లే ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌లు చేస్తున్నార‌ని శోభారాణి పేర్కొన్నారు. జ‌గ‌న్ జైలుకు వెళితే...తామే సీఎం పీఠం ఎక్కాల‌నే ఆశ‌, ఆలోచ‌న అనేక‌మందిలో ఉంద‌ని శోభారాణి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ పోటీలో వెన‌క‌బ‌డిపోకుండా ఉండేందుకే...ఇలాంటి విమ‌ర్శ‌ల‌ని ఆమె మండిప‌డ్డారు. వైసీపీలో చేరగానే బూతులు మాట్లాడేందుకు అర్హత సంపాదించేసినట్టు, అందులో మాస్టర్ డిగ్రీ చేతికొచ్చినట్టు ఫీలయిపోయి జగన్ పడేసే పదవుల బిక్ష కోసం ఉచ్ఛనీచాలు మరిచి మాట్లాడే నేతలకు ప్రజలు గడ్డి పెట్ట‌డం ఖాయ‌మ‌ని ఆమె వ్యాఖ్యానించారు.