కేసీఆర్ సంచలన నిర్ణయం.. కాల్చేద్దామా?

June 02, 2020

పరిస్థితులు చేయిదాటిపోకముందే తీవ్ర నిర్ణయాలు తీసుకుని అయినా కరోనాను అదుపులో ఉంచే దిశగా కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. సాఫ్ట్ గా ఉంటే కొందరి వల్ల దేశం కొంప మునుగుతుందని అందుకే కఠినంగా వ్యవహరిద్దామని అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఒక ప్రత్యేక సమయం మినహా మిగతా టైంలో ఎవరైనా బయట కనిపిస్తే షూట్ అట్ సైట్ (కనిపిస్తే కాల్చివేత) ఆర్డరు ఇచ్చే దిశగా ఆలోచిస్తున్నారు. 

ప్రజాస్వామ్య దేశం ఇది. అందుకే సున్నితంగా చెబుతున్నాం. ప్రజలు అర్థం చేసుకోవాలి. లేకపోతే కఠిన నిర్ణయాల వైపు మళ్లాల్సి వస్తుంది అని కేసీఆర్ అన్నట్టు సమాచారం. మాట విని సమయ పాలన, స్వీయ గృహ నిర్బంధం పాటిస్తే ఓకే. లేకపోతే త్వరలో ఈ నిర్ణయం తీసుకోవాలని.. దీనికి అవసరైమన ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. ఆర్మీని రంగంలోకి దించే అవకాశం కనిపిస్తోంది. ఇక అపుడు చర్చలు, వాదులాటలు ఏమీ ఉండవు. తీవ్రమై లాఠీ దెబ్బలు లేకపోతే కాల్పులే. మరి అలాంటి పరిస్థితి తెచ్చుకోకుండా అందరూ ఇళ్లలోనే ఉందాం.