NRI : అమెరికాలో కాల్పులు, ఒకరి మృతి

August 12, 2020

అమెరికాలో గన్ లు ఎపుడూ ఎందుకు పేలుతంటాయని అమెరికా తిరిగిన ఒక స్నేహితుడిని అడిగాను

అక్కడ వారికి దేశ భక్తి ఎక్కువ అన్నాడు

నేను అడిగిన దానికి మీరు చెప్పిన దానికి సంబంధం లేదు కదండీ అన్నాను.

ఎందుకలేదండీ.... అక్కడ దొరికేవి ఏది కొన్నా వేరే ఏ దేశమో బాగుపడుతుంది. కానీ గన్ మాత్రం మేడిన్ అమెరికా. దాని మీద ప్రతిరూపాయి అమెరికాకే చెందుతుంది. అందుకే స్వదేశీ వస్తువుల మీద ప్రేమతో ప్రతి ఒక్కడు గన్ కొనుక్కుంటాడట.

మరి గన్ చేతిలో ఉంటే అవకాశం ఉన్నపుడు పేల్చకుండా ఉంటారా?

వెటకారం అయినా ... ఇదోరకం నిజం.

ఈ విషయాన్ని పక్కన పెడితే.. అమెరికాలో మరోసారి కాల్పులు జరిగాయి. ఒక ప్రాణం గాల్లో  కలిసిపోయింది. ఇపుడు ఉన్న అనేక కష్టాలకు తోడు ఇదొకట. 

అమెరికాలోని మినియా పోలీస్ నగరంలో ఈ కాల్పుల ఘటన జరిగింది. ఒక గుర్తు తెలియని దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పులలో ఒకరు మరణించారు. 

మొత్తం ఈ దుర్ఘటనలో 11 మంది గాయపడ్డారు.  అర్దరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.  

ఒక వ్యక్తి ఈ వ్యవహారం మొత్తం వీడియో తీసి  సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ వీడియోలో చావు భయంతో జనాల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. కాల్పులకు పాల్పడిన దుండుగుడు ఇంకా దొరకలేదు.