షాక్... లండన్ పోలీసుల అదుపులో శ్రియ

August 08, 2020

దేశం కాని దేశం వెళ్లినప్పుడు అప్రమత్తతో వ్యవహరించాలి. ఏ చిన్నతప్పు దొర్లినా తిప్పలు తప్పవు. సామాన్యులకైతే విదేశాలు వెళ్లటం తక్కువ. అక్కడ ఎలా ఉండాలన్న విషయం మీద అవగాహన పెద్దగా ఉండకపోవటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ.. ప్రముఖ సినీ నటి శ్రియకు తాజాగా అలాంటి పరిస్థితే ఎదురుకావటం గమనార్హం.
తాజాగా లండన్ లో ఒక తమిళ సినిమా షూటింగ్ జరుగుతోంది.ఈ చిత్ర షూటింగ్ లో భాగంగా లండన్ లోని ప్రఖ్యాత ఎయిర్ పోర్టులో షూట్ చేస్తున్నారు. షూటింగ్ వేళ.. శ్రియ పొరపాటున ప్రయాణికులకు.. సందర్శకులకు ఏ మాత్రం అనుమతి లేని నిషేధిత ప్రాంతంలోకి పొరపాటున వెళ్లారట. వెంటనే.. అక్కడి భద్రతా సిబ్బంది అప్రమత్తమై.. ఆమెకు తుపాకీ చూపించి అదుపులోకి తీసుకున్నారట.
ఆ వెంటనే ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారట. ఆమె ఇబ్బందుల్లో ఇరుక్కున్న విషయం తెలుసుకున్న చిత్ర బృందం వెంటనే ఉన్నతాధికారుల్ని సంప్రదించింది. జరిగిన విషయాన్ని వారికి వివరించారు. దీంతో.. పరిస్థితి అర్థం చేసుకున్న లండన్ పోలీసులు ఆమెను విడిచిపెట్టారట. ఊహించని రీతిలో ఎదురైన ఈ పరిణామానికి శ్రియ షాక్ తిన్నదని.. అందులో నుంచి బయటకు రావటానికి ఆమెకు చాలా సమయం పట్టిందని చెబుతున్నారు. ఈ అనుకోని పరిణామంతో షూటింగ్ కు కాసేపు బ్రేక్ ఇచ్చి.. తర్వాత కంటిన్యూ చేశారట.