ఒకరోజు... జగన్ కు రెండు ఎదురుదెబ్బలు

June 04, 2020

కోర్టు చేత రోజుకో దెబ్బ తినకపోతే  ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు నిద్రపట్టేలా లేదు. ఈరోజు మరో అడుగు ముందుకు వేశారు. హైకోర్టు, సుప్రీంకోర్టు రెండింటిలోను ఈరోజు తిట్లు తిన్నారు. జగన్ సర్కారు చేసిన పనికి మాలిన పనులపై ఈరోజు రెండు కోర్టులు చీవాట్లు పెట్టాయి. 

ఇటీవల జగన్ రంగుల పిచ్చి ఎంత దారుణంగా ఉందో ఏపీ ప్రజలకే కాదు, దేశ ప్రజలందరికీ తెలుసు. చివరకు జాతీయ జెండాను కూాడా తుడిపేసి వైసీపీ రంగులు వేయడంతో జనం విపరీతంగా తిట్టారు. అధికారం ఉన్నపుడు కొన్ని చెల్లుబాటవుతాయి కాబట్టి జనం తిట్టుకుని ఊరుకున్నారు. ఎన్నికలు రావడంతో ఈ రంగుల పై హైకోర్టులో పిటిషను పడింది. పంచాయతీ ఆఫీసులకు పార్టీ రంగులేసి ఎన్నికలు ఎలా పెడతారు అని ఆక్షేపించడంతో హైకోర్టు రంగులు వెంటనే తొలగించి ఆధారాలతో సహా తనకు సమర్పించాలని చెప్పింది. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లింది జగన్ సర్కారు. ఈ నిర్ణయంపై అందరూ విస్మయం చెందారు. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా దానిని అంగీకరించదు అని అందరికీ తెలుసు ఒక్క జగన్ బృందానికి తప్ప. కానీ వినే మనుషులు కాదుగా.. ఈరోజు సుప్రీంకోర్టు గట్టిగా ఇచ్చింది. ఇందులో వాదించడానికి ఏం లేదు. హైకోర్టు చెప్పింది రైటే.. ముందు వెళ్లి ఆ రంగులు తొలగించడం అంటూ చీవాట్లు పెట్టింది. 

ఇక రాష్ట్రంలో హైకోర్టులో జగన్ సర్కారుకి మరో దెబ్బ తగిలింది. అమరావతి రైతుల భూములను పప్పు బెల్లాల్లా అందరికీ పంచడానికి సిద్ధమైన జగన్ సర్కారుకు గట్టిదెబ్బ తగలిగింది. రైతులు అమరావతి నగర నిర్మాణానికి ఇచ్చిన భూములను ఇతర ప్రాంతాల వారికి పంచడానికి కుదరదు అని కోర్టు తేల్చింది. కేవలం సీఆర్డీయే పరిధిలోని పేదలకు మాత్రమే ఈ భూములు పంచొచ్చు కానీ ఇతర ప్రాంతాల వారికి పంచే సమస్యేలేదని పేర్కొంది. దీంతో ఇక్కడా జగన్ సర్కారు అసమర్థత తలతిక్క నిర్ణయాలు హేళనకు గురయ్యాయి. 

సంపద సృష్టిపై ఏ మాత్రం దృష్టిపెట్టని జగన్ జనం కష్టపడి కట్టిన పన్నులను తన పేరు పెట్టుకుని సంక్షేమ పథకాల రూపంలో అప్పనంగా పంచేయడంలో మాత్రం  నిమిషం ఆలస్యం చేయడం లేదు.