మోడీని దారుణంగా తిట్టాడే

July 01, 2020

సాఫ్ట్ గా మాట్లాడే సిద్ధరామయ్య మోడీపై ఎన్నడూ లేనంత సీరియస్ గా విమర్శలు చేశారు. దేశంలో అత్యంత విఫల ప్రధాని నరేంద్ర మోడీ అని వ్యాఖ్యానించిన సిద్ధరామయ్య.. బీజేపీ కానీ, మోదీ కానీ గత ఐదేళ్ల పాలనలో చేసిందేమీ లేదని విమర్శించారు.
చెప్పుకోవడానికి చేసిందేమీ లేక పోవడం వల్లే... ఆర్మీని, దేవుడిని మోడీ వాడుకుంటున్నారని అన్నారు. మోదీ నామ జపం చేస్తూ, జనాల వద్ద ఓట్లను డిమాండ్ చేస్తున్నారని దుయ్యబట్టారు.
మోడీకి వచ్చిన విద్య మాయలు చేయడం మాత్రమే. దేశ ప్రజల కోసం మోడీ ఏమీ చేయలేదు. చేయలేడు కూడా. తన మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తాడు. మోదీ చెప్పినన్ని అబద్ధాలు ఎవరూ చెప్పలేదు. మోడీ వంటి అబద్దాలకోరుని, మోసగాడిని తన జీవితంలో ఎన్నడూ చూడలేదని అని సిద్ధరామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
2013 నుంచి 2018 వరకు తాను కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్నానని, అదే సమయంలో మోదీ ప్రధానిగా ఉన్నారని... ఎవరు ఎలాంటి అభివృద్ధి చేశారనే విషయంపై చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. మోడీ ప్రధానిగా ఒక్క అద్భుతాన్ని కూడా నేను చూడలేకపోయానన్నారు.