రాహుల్ గాంధీని ఎవరూ ఇంతలా నమ్మలేదు

July 12, 2020

ఇటీవ‌ల కాలంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తూ త‌ర‌చూ వార్త‌ల్లోకి ఎక్కుతున్న మాజీ క్రికెట‌ర్ న‌వ‌జ్యోతి సింగ్ సిద్ధూ తాజాగా మ‌రో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు. కాంగ్రెస్ జాతీయాధ్య‌క్షుడు ఈసారి ఎన్నిక‌ల్లో రెండు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ నుంచి ఆయ‌న బ‌రిలోకి దిగుతున్నారు. తాను రెగ్యుల‌ర్ గా బ‌రిలోకి దిగే అమేథీ ప్ర‌జ‌లు రాహుల్ ను రిజెక్ట్ చేసే అవ‌కాశం ఉంద‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది.
ఈ మాట అంత‌కంత‌కూ విస్త‌రిస్తున్న వేళ‌.. ఇలాంటి అంచ‌నాల‌కు చెక్ పెట్టాల‌న్న ఆలోచ‌న‌కు కాంగ్రెస్ పార్టీ వ‌చ్చిన‌ట్లుగా క‌నిపిస్తోంది. ఈసారి అమేధీలో రాహుల్ ఓట‌మి ఖాయ‌మ‌ని.. బీజేపీ అదే ప‌నిగా ప్ర‌చారం చేస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో రాహుల్ కు చుక్క‌లు చూపించిన కేంద్ర‌మంత్రి స్మృతి ఇరానీకి ఈసారి విజ‌యం త‌థ్య‌మ‌ని అంచాన వేస్తున్నాయి.
ఈ ప్ర‌చారానికి చెక్ పెట్టేందుకు వీలుగా కాంగ్రెస్ శ్రేణులు రంగంలోకి దిగుతున్నాయి. అలాంటి ఆప‌రేష‌న్లో ఒక‌దాన్ని న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ షురూ చేశారు. అమేథీ నుంచి కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ కానీ ఎన్నిక‌ల్లో ఓడిపోతే.. తానిక‌ రాజ‌కీయాల్లో కొన‌సాగ‌నంటూ సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. గుండుసూది నుంచి విమానం త‌యారీ వ‌ర‌కూ కాంగ్రెస్ హ‌యాంలోనే జ‌రిగింద‌న్న విష‌యాన్ని గుర్తు చేశారు. త‌మ యువనేత రాహుల్ కు అండ‌గా సిద్ధూ స‌వాల్.. పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింప‌ట‌మే కాదు.. ఫీల్ గుడ్ ఫ్యాక్ట‌ర్ వ‌ర్క్ వుట్ అయ్యేలా చేస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.